ముక్కు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
==భాషా విశేషాలు==
[[Image:Head_olfactory_nerve.jpg|thumb|right|ముక్కు నిర్మాణం మరియు ఘ్రాణనాడి.]]
[[తెలుగు భాష]]లో ముక్కు పదానికి చాలా ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=995&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువులో ముక్కు పదానికి గల ప్రయోగాలు.]</ref> ముక్కు ను నాసిక అంటారు. పక్షి ముఖాన్ని కూడా ముక్కు అని పిలుస్తారు. "చనుముక్కు" (a nipple) అంటే వక్షోజాల మధ్యనుండే చనుమొనలు. ముక్కు మొగము ఎరగనట్టు మాట్లాడినాడు అనగా మనిషిని గుర్తుపట్టనట్లుగా ఉన్నాడు అని ప్రయోగిస్తారు. ముక్కు: [[బాధ]]తో మూల్గడానికి కూడా ముక్కుతున్నాడు అంటారు. కొన్ని పదార్ధాలు పాడయిపోవడాన్ని కూడా ముక్కిపోయాయి అంటారు. ఉదా: ముత్యాలు ముక్కిపోయినవి. ముక్కురంధ్రములు లేదా నాసాపుటములు. బలిష్టమైన [[జంతువు]]లను అదుపుచేయడానికి వాని ముక్కులోపలినుండి త్రాడు దూర్చి పట్టుకుంటారు. దీనిని "ముక్కుత్రాడు" లేదా "ముకుత్రాడు" అంటారు. సులోచనము, [[కళ్ళద్దాలు|కండ్లద్దములను]] "ముక్కద్దము" అని కూడా పిలుస్తారు. ముక్కమ్మి లేదా ముక్కుకమ్మి (ముక్కు + కమ్మి.) లేదా [[ముక్కర]] (ముక్కు &plus; రాయి.) ఒక విధమైన నాసాభరణము. A nostril, నాసికారంధ్రము. ముక్కిడి (ముక్కు + ఇడి) ముక్కులేని. ముక్కిడిరోగము ముక్కు ఎముక పాడై దూలము చదునుగా మారి ముక్కు లేనట్లుగా కొన్ని వ్యాధులలో జరుగుతుంది. ముక్కుదూలము లేదా ముకుదూలము రెండు ముక్కు రంధ్రాల మధ్యగల దూలము లేదా ముక్కునడిమి యెముక. [[ముక్కుపొడి]] అనగా నస్యము, పొడుము. "ముక్కుపోగు" (A nose ring) అనేది ముక్కుమ్మి, నత్తు. ముక్కులు అనగా మిక్కిలి చిన్ననూకలు.
 
== ఆరోగ్య సంబంధ విపత్తులు==
"https://te.wikipedia.org/wiki/ముక్కు" నుండి వెలికితీశారు