దువ్వూరి వేంకటరమణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దువ్వూరి వేంకటరమణ శాస్త్రి''' సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, [[కళాప్రపూర్ణ]] గ్రహీతలు.
 
వీరిది [[తూర్పు గోదావరి జిల్లా]]లో [[మసకపల్లి]] గ్రామం. వీరి ఇంటి పేరు [[దువ్వూరి]]వారు. [[దువ్వూరు (సంగం)|దువ్వూరు]] అనేది గ్రామ నామం. ఈ ఊరు నెల్లూరు జిల్లాలో ఉన్నది. వీరి పూర్వులు మొట్టమొదట ఈ గ్రామవాసులై వుండి క్రమేణా గోదావరీ ప్రాంతం చేరారు. ఊరు శబ్దం ఔప విభక్తికం గనుక 'ఇ' కారం వచ్చి దువ్వూరి వారయ్యారు. ఈ యింటి పేరుతో గోదావరి మండలంలో వందలకొలది ఉన్నాయి.
 
వీరు [[విలంబి]] నామ సంవత్సరం [[వైశాఖ శుద్ధ పంచమి]] నాడు జన్మించారు. వీరి విద్యాభ్యాసం తాతగారైన రామచంద్రుడు వద్ద జరిగినది. వీరిరువురూ చదువు ముగిసిన తర్వాత ఎక్కువగా "కట్టు శ్లోకాలు" అనే చిత్రమైన సారస్వత క్రీడా వినోద ప్రక్రియ ఆడేవారు. ఇది నేటి [[అంత్యాక్షరి]] లాంటిది. అయితే పాటలతో కాకుండా శ్లోకాలతో ఆడాలి.