విడాకులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
==తల్లిదండ్రులకూ పాఠాలు==
మదురై కామరాజ్‌ విశ్వవిద్యాలయం తల్లిదండ్రుల కోసం రెండేళ్ల వ్యవధిగల ఎంఏ 'ప్యారెంటింగ్‌' కోర్సు ప్రకటించింది.పిల్లల మానసిక స్థితి, కుటుంబ వాతావరణం, పాఠశాలలో ఒత్తిడిలాంటివి నేటి విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సిలబస్‌ ఉంటుంది.విడాకుల శాతం రోజురోజుకూ పెరుగుతోంది. భార్యభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా వారు విడిపోతున్నారు. కానీ వారి నిర్ణయం తమ పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న విషయాన్ని వారు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు.విడాకుల ఆలోచనను విరమించుకునేందుకు కోర్టులు కౌన్సిలింగ్‌ కోసం కుటుంబ సలహాదారులను నియమిస్తున్నా మార్పు రావట్లేదు. ఎక్కువమందికి విడాకులు మంజూరు కూడా అవుతున్నాయి. తల్లిదండ్రుల నిర్ణయం పిల్లల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బార్య భర్తల విడాకుల సమస్యను పరిష్కరించడానికి, తద్వారా పిల్లలకు మరింత సురక్షిత భవిష్యత్తు అందించడం తక్షణ కర్తవ్యం.
==హిందూ వివాహ చట్టంతో కీడే ఎక్కువ==
విడాకుల కేసులు పెరిగిపోతుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. విడాకుల వల్ల విడిపోయిన కుటుంబాల్లోని పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోందని విచారం వ్యక్తంచేసింది. హిందూ వివాహ చట్టం దేశంలోని కుటుంబ వ్యవస్థకు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తోందని తెలిపింది. ''ఈ చట్టం నిలబెట్టిన కాపురాల కంటే కూల్చినవే అధికం'' అని జస్టిస్ అరిజిత్ పసాయత్, జస్టిస్ జీ.ఎస్.సింఘ్వీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ''వివాహాల సమయంలోనే ముందస్తు విడాకుల పిటిషన్లు దాఖలవుతున్నాయి'' అని వ్యాఖ్యానించింది.జీవిత భాగస్వామికి కుష్టు, మానసిక అనారోగ్యం లాంటి వ్యాధులున్నాయనే కారణాలపై విడాకులు ఇచ్చేందుకు ఈ చట్టంలో ఉన్న నిబంధనలను ధర్మాసనం తప్పుబట్టింది. వీటిని కొన్ని జంటలు దుర్వినియోగం చేస్తున్నాయని చెప్పింది. ''పాత రోజుల్లో మన తాత, ముత్తాతలకు ఇలాంటి సమస్యలు లేవు. అప్పట్లో వివాహ వివాదాలు నాలుగు గోడల మధ్య ఇంట్లోనే పరిష్కారమయ్యేవి''అని వ్యాఖ్యానించింది. పిల్లలకోసం అహం వదులుకోవాలని విడిపోయిన బాలుడి తల్లిదండ్రులనుద్దేశించి పేర్కొంది.తల్లిదండ్రుల విడాకులవల్ల చివరకు బాధపడేది పిల్లలే. ఆడపిల్ల విషయంలోనైతే పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటుంది.ముఖ్యంగా వివాహం సమయంలో''అని జస్టిస్ పసాయత్ చెప్పారు.(ఈనాడు 8.6.2008).
"https://te.wikipedia.org/wiki/విడాకులు" నుండి వెలికితీశారు