మాతృభాష: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
*తెలుగుమీడియం లో డిగ్రీ చదివినవారికి 1995వరకు ఏ.పి.పి.యస్.సి.నిర్వహించిన గ్రూప్1,2 పరీక్షలలో 5% వైటేజి మార్కులు కలిపేవారు.
*రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్ఆర్‌బీ) నిర్వహించే పరీక్షలను ఉద్యోగార్థులు తమ మాతృ భాషల్లోనే రాసే వీలు 2009 నుండి కల్పిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ అవకాశం ఉంటుంది.
==గిరిజన మాతృభాషల్లో నిఘంటువులు పుస్తకాలు==
ఆదిలాబాద్‌, వరంగల్‌, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఖమ్మంజిల్లాల్లో వందలాది గిరిజన తెగలున్నాయి...వారి భాషలూ అనేకం. కోయంగ్‌(గోండి), కొలవర్‌గొట్టి(కొలామి), కోయ, కొండ, కువి, ఆదివాసిఒరియా, సవర(సొరబాస), బంజారా తదితర ఎన్నోభాషల్ని మాట్లాడుతుంటారు.మాతృభాషలో ప్రాధమిక విద్యాభ్యాసం కోసం ఎనిమిది గిరిజన భాషానిఘంటువులను డిజిటల్‌రూపంలో భద్రపర్చారు.ఒక్కోభాషకూ ఒక్కోవెబ్‌సైట్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనా ఉంది.(ఈనాడు5.12.2009)
 
==పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే==
పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).
"https://te.wikipedia.org/wiki/మాతృభాష" నుండి వెలికితీశారు