కర్ణాటక సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 73:
 
==నేర్చుకోవడం==
ఈ సంగీతాన్ని బోధించడానికి పురందరదాసు కొన్ని పద్దతులు ఏర్పరచాడు. దీని ప్రకారం ముందుగా '''వరుసలు''' నేర్పిస్తారు. తరువాత '''అలంకారాలు''', '''గీతాలు''' (సులభమైన పాటలు), '''స్వరజతులు''' నేర్పించబడతాయి. విద్యార్థి ఒక దశ చేరుకున్న తర్వాత '''వర్ణాలు''', '''కృతులు''' బోధిస్తారు. సాధారణంగా వేదిక మీద ప్రదర్శన ఇవ్వడానికి ఒక విద్యార్థికి కొన్ని ఏళ్ళ కాలం అవసరమౌతుంది. ఈ సంగీతాన్ని మొదటి సారిగా నేర్చుకునే వారికి '''మాయామేళమాయా గోళమాళవ గొఉళ రాగాన్ని''' నేర్పిస్తారు. ఇదిసంగీతంలో తొలి అడుగులు వేసేవారికి అనుకూలంగా ఉంటుందని పురంధర దాసు ప్రకటించాడు.
 
బోధనా పద్దతులు, ఉపకరణాలు దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాలలోనూ ఒకే విధంగా ఉంటాయి. అభ్యాసం సరళీ వరుసలతో ప్రారంభమై, క్రమంగా క్లిష్టమైన అంశాలకు మళ్ళుతుంది. సాంప్రదాయకంగా ఈ సంగీతాన్ని [[గురుకుల విద్యా విధానం]] లోనే బోధించే వారు. కానీ 20వ శతాబ్దం మలి భాగం నుంచీ ప్రజల జీవనశైలిలో గణనీయమైన మార్పులు సంభవించడంతో, ఈ సంగీతాన్ని నేర్చుకోదలచిన పిల్లలు, దీనికి సమాంతరంగా మరో విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగించాల్సి రావడంతో గురుకుల విధానం ప్రాచుర్యాన్ని కోల్పోయింది.
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_సంగీతం" నుండి వెలికితీశారు