శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం''' ([[ఆంగ్లం]]: Sri Krishna Devaraya Andhra Bhasha Nilayam) [[ఆంధ్ర ప్రదేశ్]] రాజధాని [[హైదరాబాదు]] లోని ప్రాచీన [[గ్రంథాలయము]].<ref>[http://www.hindu.com/2007/03/14/stories/2007031419580400.htm Andhra Bhasha Nilayam demolished in The Hindu.]</ref>
 
ఈ గ్రంథాలయం [[సెప్టెంబర్ 1]], [[1901]] సంవత్సరంలో ([[ప్లవ]] నామ సంవత్సరం [[శ్రావణ బహుళ తదియ]] ఆదివారం) [[హైదరాబాదు]]లోని రామ కోటి ప్రాంతంలో స్థాపించబడినది. ఇది [[తెలంగాణా]] ప్రాంతంలో మొదటి [[గ్రంథాలయం]]. దీని స్థాపనతో ప్రారంభమైన నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమం తెలంగాణా ప్రజలలో చైతన్య కలుగజేసి తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనానికి అపారమైన కృషి జరిపింది. దీని స్థాపనకు విశేషకృషి చేసినవారు [[కొమర్రాజు లక్ష్మణరావు]]. వీరికి ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సాహమిచ్చినవారు [[నాయని వేంకట రంగారావు]] మరియు [[రావిచెట్టు రంగారావు]] గార్లు. అప్పటి పాల్వంచ రాజాగారైన శ్రీ పార్థసారధి అప్పారావు గారు స్థాపన సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి సభను అలంకరించిన పెద్దలలో మునగాల రాజా శ్రీ నాయని వెంకట రంగారావు, శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు, డా. ఎం.జి. నాయుడు, ఆదిపూడి సోమనాథరావు, శ్రీ మైలవరపు నరసింహ శాస్త్రి, శ్రీ రావిచెట్టు రంగారావు, శ్రీ ఆది వీరభద్రరావు, శ్రీ కొఠారు వెంకట్రావు నాయుడు పేర్కొనదగినవారు.