శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
1915 సంవత్సరంలో ఆంధ్ర పితామహుడిగా ప్రసిద్ధిచెందిన శ్రీ [[మాడపాటి హనుమంతరావు]] పంతులు కార్యదర్శి పదవిని చేపట్టిన తర్వాత పాత ఇల్లు స్థానంలో కొత్త భవనం నిర్మించడానికి దీక్ష వహించారు. శ్రీ నాయని వెంకట రంగారావు, కర్పూరం పార్థసారధి, నాంపల్లి గౌరీశంకర వర్మ, లాల్ జీ మేఘ్ జీ గారల ఆర్థిక సహాయంతో నూతన భవన నిర్మాణం జరిగింది. ఈ భవనానికి ప్రఖ్యాత విద్యావేత్త శ్రీ [[కట్టమంచి రామలింగారెడ్డి]] గారు సెప్టెంబర్ 30, 1921 తేదీన ప్రారంభోత్సవం చేశారు.
 
==ఉత్సవాలు==
ఈ భాషా నిలయం జంట నగరాలకే కాక తెలంగాణ ప్రాంతపు ఆంధ్రులందరికీ కూడలి స్థలమైనది. ఉత్సవాలు, ప్రసంగాలు, సభలు, సమావేశాలు జరుపుకోవడానికి మంచి అవకాశం కలిగింది. చక్కని హాలులో సభలు జరిగేటప్పుడు స్త్రీలకు కొంతభాగం కేటాయించవలసి వచ్చేది. అందువలన హాలులో ఒక బాల్కనీ నిర్మించి మహిళలకు ప్రత్యేక వసతి కల్పించడం జరిగింది. శ్రీ కృష్ణదేవరాయలు జయంతి ఉత్సవంతో ప్రారంభించి క్రమేణా నన్నయ, తిక్కన, పోతన, వేమన మొదలైన మహాకవుల జయంతి ఉత్సవాలను ప్రతియేట జరుపుతూ ఉండేవారు. ప్రాచీన కవులే కాక కందుకూరి, గురజాడ, గిడుగు, కొమర్రాజు వంటి ఆధునిక భాషా సేవకుల జయంతులు, వర్ధంతులు కూడా జరుపసాగారు. ఆంధ్రదేశం నలుమూలల నుంచి వివిధ రంగాలలో నిష్ణాతులైన పండితులను, రచయితలను, కవులను ఆహ్వానించి, సన్మానాలు చేశారు.
 
భాషా నిలయం స్థాపన జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో [[రజతోత్సవాలు|రజతోత్సవాలను]] 1927 ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో [[కావ్యకంఠ గణపతి శాస్త్రి]] గారి అధ్యక్షతన జరిగాయి. అప్పటి గౌరవ కార్యదర్శి శ్రీ [[బూర్గుల రామకృష్ణారావు]] ప్రధాన పాత్ర పోషించి రజతోత్సవ సంచిక ప్రచురించారు.
 
దీని [[స్వర్ణోత్సవాలు]] 1952 సెప్టెంబరు 1వ తేదీనుండి మూడు రోజులపాటు వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు అధ్యక్షత వహించారు. అప్పటి ఆంధ్ర ప్రభుత్వ ఆస్థానకవి [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] గారు ప్రారంభోత్సవం చేశారు. ఉత్సవాలలో భాగంగా ఆనాటి తెలంగాణలోని 114 గ్రంథాలయాల ప్రతినిధుల సమావేశం, స్త్రీల సభ, వైజ్ఞానిక సభ, సాహిత్య సభ, కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ సంచికను ప్రచురించారు.
 
ఈ గ్రంథాలయంలో సుమారు 40,00 పైగా గ్రంథాలు మరియు పత్రికలు సేకరించబడి సాహితీ ప్రియులకు ఉపకరిస్తున్నాయి. ఈ భాషా నిలయం నేటికీ సాహిత్య సభలూ, సమావేశాలు జరిపిస్తూ కవి సమ్మేళనాల్ని నిర్వహిస్తూ తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడుతున్నది.