శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
భాషానిలయ [[వజ్రోత్సవాలు]] 1962 సంవత్సరంలో వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ [[దామోదరం సంజీవయ్య]] గారి అధ్యక్షతన జరిగిన మూడు రోజుల ఉత్సవాలలో వివిధ సాహిత్య, సాంస్కృతిక విషయాలపై చర్చలు, గోష్ఠులు జరిగాయి. వజ్రోత్సవ సంచికను ప్రచురించారు.
 
భాషా నిలయపు [[అమృతోత్సవం]] 1977లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ [[జలగం వెంగళరావు]] గారి నేతృత్వంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో యావదాంధ్ర దేశం నుంచి వచ్చిన అనేకమంది రచయితలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.
 
[[శతాబ్ది]] ఉత్సవాలు 2002 సెప్టెంబర్ 16వ తేదీన భాషా నిలయం ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఉత్సవాలను ప్రారంభించారు.
 
ఈ గ్రంథాలయంలో సుమారు 40,00 పైగా గ్రంథాలు మరియు పత్రికలు సేకరించబడి సాహితీ ప్రియులకు ఉపకరిస్తున్నాయి. ఈ భాషా నిలయం నేటికీ సాహిత్య సభలూ, సమావేశాలు జరిపిస్తూ కవి సమ్మేళనాల్ని నిర్వహిస్తూ తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడుతున్నది.