మెడ నొప్పి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''మెడ నొప్పి''' ఒక దీర్ఘకాలిక సమస్య. ఇది ఆధునిక కాలంలో జీవిత విధా...
(తేడా లేదు)

07:22, 30 డిసెంబరు 2009 నాటి కూర్పు

మెడ నొప్పి ఒక దీర్ఘకాలిక సమస్య. ఇది ఆధునిక కాలంలో జీవిత విధానాలకనుగుణంగా ఎక్కువ అవుతున్నది. ఈ నొప్పి మెడ నుంచి భుజానికో, చేతుల చివరులకో పాకుతూ ఉంటె కొంచెం శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది.

నిర్మాణం

మెడలో ఉండే వెన్నుముకలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్‌ (Atlas) అని. రెండవ వెన్నుపూసను ఆక్సిస్‌ (Axis) అని అంటారు. ఆ తర్వాత పూసలను సర్వెకల్‌ 3,4,5,6,7 వెన్నుపూసలు అంటారు. ఇవన్నీ ఒకదానిపై మరొకటి అమర్చి ఉంటాయి. వీటిలో స్పైనల్‌ కెనాల్‌ (Spinal canal) ఉంటుంది. దాని ద్వారా స్పైనల్‌ కార్డ్‌ అంటే వెన్నుపాము మెదడు నుంచి కాళ్లకు, చేతులకు నరాలకు తీసుకెళుతుంది. ఒక వెన్నుపూసకు, మరొక వెన్ను పూసకు మధ్యలో ఉండే ఇంటర్‌ వెర్టిబ్రల్‌ ఫొరామినా నుండి ఒక్కొక్క నరం బైటకు వస్తుంది. వెన్నుపూసల మధ్యలో ఉండి డిస్క్‌ షాక్‌ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. డిస్క్‌కి రక్తప్రసరణ అవసరం ఉండదు.

కారణాలు

  • ఎక్కువ మందిలో వారు నిల్చునే, కూర్చునే భంగిమలు సరిగ్గా లేకపోవడం కారణంగానే మెడ నొప్పి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
  • ఒక్కోసారి వెన్ను పూసల మధ్యలో ఉండే డిస్క్‌ వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తా యి. ఈ డిస్క్‌ జారి నరాల మీద ఒత్తిడి కలిగినపుడు నొప్పి వస్తుంటుంది.
  • వెన్నుపూసలో నుంచి మెదడు లోకి వెళ్లే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్‌ ఆర్టరీస్‌ చిన్న మెదడుకు రక్తప్రసరణ అందిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఆర్టరీస్‌ రక్త ప్రసారంలో తేడాలు వచ్చి మెదడుకు రక్తప్రసారం అంతగా ఉండదు. దీని మూలంగా నొప్పితో పాటు తలతిరగడం, దిమ్ముగా అని పించడం, వాంతులు అవుతుంటాయి.

==ఇతర సమస్యలు మెడనొప్పి తీవ్రత వల్ల మూత్రాశయంలో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ. నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద వత్తిడి పెరిగి అటు తర్వాత మూత్ర విసర్జనలో తేడాలు వచ్చి ఇతర ఆరోగ్య సమస్యలు దారితేసే అవకాశం ఉంది.

పరీక్షలు

మెడనొప్పి వచ్చే వారికి ఎక్సరే తీస్తే వెన్నుపూసలలో ఏమైన తేడాలు ఉన్నా తెలుసుకోవచ్చును. ఇంకా సూక్ష్మమైన సమస్యలు ఉన్నావారికి ఎం.ఆర్‌.ఐ. స్కాన్‌ ద్వారా పరిక్షలు నిర్మహించి దీని ద్వారా ఏ నరం మీద ఎంత ఒత్తిడి ఉందో తెలుసుకొని ఆ వత్తిడి దేని వల్ల నచ్చింది? ఏదైనా ఎముక ఫ్రాక్చర్‌ అయిందా? నరాల్లో వాపు ఏమైనా ఉందా? గడ్డలు ఉన్నాయా? ఇవన్నీ ఎం.ఆర్‌.ఐ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. డిస్క్‌ ప్రొలాప్స్‌ (డిస్క్‌ తాను ఉండే స్థానం నుంచి తొలగడం) ఉంటే ఎంత మేరకు ఆ సమస్య ఉందో గమనించి దానిని చికిత్స చేస్తారు.

=చిట్కాలు

మెడ నొప్పి వచ్చినప్పుడు వేడినీళ్లలో మెత్తటి వస్త్రాన్ని ముంచి, పిండి మెడపైన కాపడం లేదా ఐస్‌ముక్కను క్లాత్‌లో చుట్టి దానితో కాపడం పెడితే సాధరణ నొప్పి నుంచి రిలీఫ్‌ లభిస్తుంది. మెడ కండరాలలో నొప్పి ఉన్నపుడు తప్పనిసరిగా ఆ భాగానికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్‌ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది. సాధారణ నొప్పి అయితే పెయిన్‌ కిల్లర్‌ అయింట్‌ మెంట్లు ఉంటాయి. వీటితో రోజుకి ఐదారు సార్లు సున్నితంగా మసాజ్‌ చేస్తే నొప్పి నుంచి రిలీఫ్‌ ఉంటుంది.

మూలాలు

మెడనొప్పితో తస్మాత్‌ జాగ్రత్త, సూర్య పత్రికలో డాక్టర్‌ జగదీశ్‌ చట్నల్లి వ్యాసం.