మెడ నొప్పి: కూర్పుల మధ్య తేడాలు

1 బైటు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
(కొత్త పేజీ: '''మెడ నొప్పి''' ఒక దీర్ఘకాలిక సమస్య. ఇది ఆధునిక కాలంలో జీవిత విధా...)
 
మెడనొప్పి వచ్చే వారికి ఎక్సరే తీస్తే వెన్నుపూసలలో ఏమైన తేడాలు ఉన్నా తెలుసుకోవచ్చును. ఇంకా సూక్ష్మమైన సమస్యలు ఉన్నావారికి ఎం.ఆర్‌.ఐ. స్కాన్‌ ద్వారా పరిక్షలు నిర్మహించి దీని ద్వారా ఏ నరం మీద ఎంత ఒత్తిడి ఉందో తెలుసుకొని ఆ వత్తిడి దేని వల్ల నచ్చింది? ఏదైనా ఎముక ఫ్రాక్చర్‌ అయిందా? నరాల్లో వాపు ఏమైనా ఉందా? గడ్డలు ఉన్నాయా? ఇవన్నీ ఎం.ఆర్‌.ఐ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. డిస్క్‌ ప్రొలాప్స్‌ (డిస్క్‌ తాను ఉండే స్థానం నుంచి తొలగడం) ఉంటే ఎంత మేరకు ఆ సమస్య ఉందో గమనించి దానిని చికిత్స చేస్తారు.
 
==చిట్కాలు==
మెడ నొప్పి వచ్చినప్పుడు వేడినీళ్లలో మెత్తటి వస్త్రాన్ని ముంచి, పిండి మెడపైన కాపడం లేదా ఐస్‌ముక్కను క్లాత్‌లో చుట్టి దానితో కాపడం పెడితే సాధరణ నొప్పి నుంచి రిలీఫ్‌ లభిస్తుంది. మెడ కండరాలలో నొప్పి ఉన్నపుడు తప్పనిసరిగా ఆ భాగానికి [[విశ్రాంతి]] ఇవ్వాలి. ఎందుకంటే కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్‌ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది. సాధారణ నొప్పి అయితే పెయిన్‌ కిల్లర్‌ అయింట్‌ మెంట్లు ఉంటాయి. వీటితో రోజుకి ఐదారు సార్లు సున్నితంగా మసాజ్‌ చేస్తే నొప్పి నుంచి రిలీఫ్‌ ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/478891" నుండి వెలికితీశారు