"టి.యస్.విజయచందర్" కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
(విస్తరించాను)
(విస్తరణ)
{{మొలక}}
'''టి.యస్.విజయచందర్''' ఒక ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఇతడు నటించిన చారిత్రాత్మకమైన [[కరుణామయుడు]], [[ఆంధ్రకేసరి]] మొదలైన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆయన అసలు పేరు రామచందర్. 1942లో మద్రాస్ లో పుట్టాడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఈయనకు తాత అవుతారు. తల్లిదండ్రులు పుష్పావతి, తెలిదేవర వెంకట్రావువెంకట్రావులు. ఈయన తండ్రి హోమియోపతి వైద్యులు. బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా. ఆరుమంది సంతానంలో ఈయన మూడోవాడు. విద్యాభ్యాసం అంతా కాకినాడలో జరిగింది.
 
కాకినాడ పి.ఆర్. ప్రభుత్వ కళాశాల లో ఉండగా ఆయన దృష్టి నాటకాల వైపు మళ్ళింది. ఏడిద నాగేశ్వర రావు, వి.బి. రాజేంద్ర ప్రసాద్ లు ఆయనకు సీనియర్లు. ఆయన వేసిన తొలి నాటిక లోభి. మాడా వెంకటేశ్వరరావు, ఏడిద నాగేశ్వరరావు తదితరులు స్థాపించిన రాఘవ కళాసమితి లో అనేక నాటకాల్లో పాల్గొన్నాడు. తర్వాత డిగ్రీ కోసం మళ్ళీ మద్రాస్ కు వెళ్ళాడు. 1963లో డిగ్రీ పూర్తయింది. వాళ్ళ నాన్న 1954లోనే కాకినాడలో వదిలి హైదరాబాద్ కు వచ్చేశాడు. ఈయన డిగ్రీ ఐపోయాక హైదరాబాద్ వచ్చేసి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు.
 
తొలుత విద్యుత్ శాఖ లో 84 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరాడు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో 200 రూపాయలు జీతంతో చేరాడు.
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/479777" నుండి వెలికితీశారు