"టి.యస్.విజయచందర్" కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
(విస్తరించాను)
(విస్తరణ)
{{మొలక}}
'''టి.యస్.విజయచందర్''' ఒక ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఇతడు నటించిన చారిత్రాత్మకమైన [[కరుణామయుడు]], [[ఆంధ్రకేసరి]] మొదలైన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆయన అసలు పేరు రామచందర్. 1942లో మద్రాస్ లో పుట్టాడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఈయనకు తాత అవుతారు. తల్లిదండ్రులు పుష్పావతి, తెలిదేవర వెంకట్రావులు. ఈయన తండ్రి హోమియోపతి వైద్యులు. బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా. ఆరుమంది సంతానంలో ఈయన మూడోవాడు. విద్యాభ్యాసం అంతా కాకినాడలో జరిగింది.
 
 
ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన మరో ప్రపంచం సినిమాలో జర్నలిస్టుగా అవకాశం ఇచ్చారు. తర్వాత కె.ఆర్. విజయ ప్రధాన పాత్రలో నిర్మించిన దేవీ లలితాంబ సినిమాలో విలన్ గా నటించాడు. తరువాత ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన సినిమా కరుణామయుడు. ఈ సినిమా విడుదలకు నాలుగేళ్ళు సమయం పట్టినా అద్భుతమైన స్పందన వచ్చింది. అదే పంథాలో రాజాధిరాజు, దయామయుడు, ఇలా వరుసగా సినిమాలు నిర్మించాడు. 1985 లో దర్శకుడు పి.వాసు తీసిన షిరిడీ సాయిబాబా మహత్యం ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన మరో సినిమా. ఇంకా ఎన్. శంకర్ తీసిన భద్రాచలం సినిమా కూడా మంచి పేరు తీసుకుని వచ్చింది.
 
పెళ్ళయిందికానీ కొన్ని అనివార్యకారణాల వల్ల విడిపోయారు. పిల్లలు కూడా లేరు. తండ్రి సంపాదించిన భూముల సాయంతో తెలిదేవర బిల్డర్స్ పేరుతో నిర్మాణ రంగంలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. సినిమా పరిశ్రమ ఆయన్ను అంతగా ఆదరించింది కాబట్టి హైదరాబాద్ నగరశివార్లలోని 11 ఎకరాల స్థలాన్ని చిత్రసీమ లోని సీనియర్ సిటిజెన్స్ కేసం ఇచ్చేశాడు. అంబేద్కర్ , రామకృష్ణ పరమహంస పాత్రలను పోషించాలని ఆయన కోరిక. <ref>23 నవంబర్ 2008 ఆదివారం ఆంధ్రజ్యోతి సంచిక ఆధారంగా...</ref>
 
==సినిమాలు==
*[[కరుణామయుడు]] (1978) (ఏసుక్రీస్తు) (నటుడు మరియు నిర్మాత)
*[[సుడిగుండాలు]] (1967)
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
*[http://uk.imdb.com/name/nm0897205/ ఐ.ఎమ్.డి.బి.లో విజయచందర్ పేజీ.]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/479790" నుండి వెలికితీశారు