గ్రామ దేవత: కూర్పుల మధ్య తేడాలు

చి Surya (చర్చ) చేసిన మార్పులను, రవిచంద్ర వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 37:
 
== పోషణ,రక్షణ నిచ్చే దేవతలు==
ఇక ప్రజల మనసులో పుట్టి ఏకోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే భాద్యతని స్వీకరంచి భక్తులకు అండగానిలిచే తల్లి '''తలుపులమ్మ'''. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె 'తలుపులమ్మ'గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలగే ఆతల్లిని ప్రార్దించి వెళ్ళడం చేస్తారు. వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి '''పొలిమేరమ్మ''' క్రమముగా '''పోలేరమ్మ''' అయింది. పొలిమేరలో వుండే మరొక తల్లి '''శీతలాంబ'''. ఈమె చేతుల్లో చీపురు,చేట వుంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని,భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే. 'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము...అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈపనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తి కి జీవనభ్రుతి కలిగించి పోసించే తల్లి ' పోచ+అమ్మ=పోచమ్మ'అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాదులు రాకుండా నివారిస్తుందినివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ఇక పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి '''పుట్టాలమ్మపుట్టమ్మ''' ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రమణ్యషష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈతల్లికే 'నాగేస్వరమ్మ'అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లి కి పాపమ్మ అని కూడా అంటారు. [[సుబ్రహ్మణ్య స్వామి|సుబ్రమణ్యేశ్వరుడు]] పేరుమీదే 'సుబ్బ+అమ్మ=సుబ్బమ్మ కూడా దైవము గా వుంది.
 
==గ్రామదేవతా నామ విశేషాలు ==
సాదారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దము లో ఆమెను '''మావూళ్ళమ్మ''' అని పిలుస్తూంటే క్రమము గా అది 'మావుళ్ళమ్మ' అయింది. [[శివుడు|శంకరునితో ]] కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద(గళము) మచ్చ(అంకం) కారణముగా అంకగళమ్మ '''అంకాళమ్మ''' మారిపోయింది.మహిషాసురమర్దినే మైసమ్మ,బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి '''బతుకమ్మ'''. ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట(చెరువుఅవధి) ఏదుందో ఆ కట్టని మేయగల(ఆ అవధినించి గట్టురక్షించగల)పైఅమ్మే'కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో నున్న మైసమ్మే '''కట్టమైసమ్మ''' అయింది.ఎప్పుడూ సత్యమైనగ్రామప్రజల మంచిని చూసే(కనే)అమ్మ '''కన్నమ్మ''' గా ఎప్పుడూ సత్యాన్ని(నిదర్సనాలని)చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= '''సత్తెమ్మ'''. స్వచ్చమైన అమ్మ అనే అర్దములో అచ్చ(స్వచ్చమని)సు+అచ్చ=స్వచ్చ అనే రెండు పదాలు కలిపి '''అచ్చమ్మ''' గా అయ్యింది. అలాగే పుల్ల(వికసించిన కళ్ళున్న)అమ్మ '''పుల్లమ్మ'''. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్దగాపరిశీలించి సూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా '''అప్పలమ్మ''' అయినది. [[బెల్లము]] బాగా వున్న ప్రాంతాలలో ఈతల్లి కి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= '''అప్పలమ్మ''' అన్నారు. అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది [[బాలా త్రిపుర సుందరి]] విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి(బాల)+అమ్మ= '''పెంటమ్మ'''. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల(భోజనమనే పదానికి విక్రుతి)+అమ్మ= '''బోనాలమ్మ'''. అయ్య అయిన శంకరునికి అమ్మ(భార్య)కాబట్టి ఈమెను 'అయ్యమ్మ'అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. [[లలిత|లలితాంబ]], [[భండాసురుడు|భండాసురుణ్ణి]] చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= '''గుర్రాలమ్మ''' అయినది. ఇక ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోలు+అంబ='సోమపోలమాంబ'అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర [[శ్రీకాకుళం]] జిల్లా లోని సోంపేట.
 
==అమ్మోర్లు==
"https://te.wikipedia.org/wiki/గ్రామ_దేవత" నుండి వెలికితీశారు