"జై ఆంధ్ర ఉద్యమం" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==పరిష్కారం==
[[జనవరి 10]] న కాంగ్రెసు పార్టీ తమ ముఖ్యమంత్రి, [[పి.వి.నరసింహారావు]] చేత రాజీనామా చేయించి [[రాష్ట్రపతి పాలన]] విధించింది. ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం దృఢంగా వ్యవహరించింది. ఉద్యమం ఆపివేయడానికి ఆరు సూత్రాల పథకాన్ని ప్రతిపాదించింది. ఆ పథకం ఇది <ref name="6points">[http://www.aponline.gov.in/Apportal/HomePageLinks/PresidentialOrder/Presidential_Order.pdf ఆరు సూత్రాల పధకం యొక్క పూర్తి పాఠం]</ref>:
#ముల్కీనిబంధనలు ముల్కీ నిబంధనలు, తెలంగాణ ప్రాంతీయ సంఘాలను రద్దు చేస్తారు.
# నాన్ గజిటెడ్ ఉద్యోగాలు, సివిలు అసిస్టెంటు సర్జను ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే ఇస్తారు.
# ప్రభుత్వోద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమిస్తారు.
# వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కొరకు రాష్ట్రాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తారు.
# హైదరాబాదు లో కేంద్రవిశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి దోహదం చేస్తారు.
# పై సూత్రాలను చేరుస్తూ [[రాజ్యాంగ సవరణ]] చేస్తారు.
 
ఉద్యమ కార్యాచరణ సంఘం ఈ పథకాన్ని ఆమోదించింది. [[1973]] [[డిసెంబర్]] లో పార్లమెంటు ఈ ప్రణాళికను 33 వ రాజ్యాంగ సవరణ ద్వారా [[భారత రాజ్యాంగం|రాజ్యాంగం]]లో చేర్చింది. కేంద్రం రాష్ట్రపతి పాలన తొలగించి [[జలగం వెంగళరావు]] నాయకత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది.
10,646

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/479947" నుండి వెలికితీశారు