బీహార్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ace:Bihar
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:ബിഹാർ; cosmetic changes
పంక్తి 23:
}}
 
'''బీహార్''' (बिहारबिहार) భారతదేశపు తూర్పుభాగాన ఉన్న ఒక రాష్ట్రము. రాజధాని [[పాట్నా]].
 
బీహార్‌కు ఉత్తరాన నేపాల్ దేశము సరిహద్దున్నది. పశ్చిమాన [[ఉత్తర ప్రదేశ్]], దక్షిణాన [[ఝార్ఖండ్]],ఈశాన్యాన [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రాలున్నాయి. బీహార్ రాష్ట్రం [[హిందీ]] మాట్లాడే ప్రాంతపు మధ్యనుంది. సారవంతమైన [[గంగా నది|గంగానదీ]] మైదానం బీహార్‌లో విస్తరించి ఉన్నది.
 
== చరిత్ర ==
 
=== పురాతన చరిత్ర ===
 
బీహారు చరిత్ర పురాతనమైనది. ఒకప్పుడు ఇది మగధ ప్రాంతము.నేటి [[పాట్నా]] ఆనాటి పాటలీపుత్రనగరం. [[మౌర్య]]సామ్రాజ్యానికి రాజధాని. అప్పటినుండి వెయ్యేళ్ళకాలం ప్రముఖ రాజకీయ, సాంస్కృతిక, విద్యా కేంద్రంగా వెలిగింది. [[నలందా]], [[విక్రమశీల]] విశ్వవిద్యాలయాలు ప్రపంచప్రఖ్యాతి గాంచినవి.
పంక్తి 42:
[[బౌద్ధమతం|బౌద్ధ]], [[జైనమతం|జైన]] మతాలకు బీహార్ జన్మస్థలం. [[బోధ్‌గయ]]లో [[గౌతమబుద్ధుడు]] జ్ఙానోదయం పొంది, ధర్మ బోధన ఆరంభించాడు. జైనమత [[ప్రవక్త]] [[మహావీరుడు]] బీహారులోని [[వైశాలి]]లో జన్మించాడు.
 
=== మధ్యయుగపు చరిత్ర ===
 
విదేశీయుల దండయాత్రలతో బీహార్ ప్రాభవం బాగా దెబ్బతిన్నది. 12వ శతాబ్దంలో [[మహమ్మదు ఘోరీ]] సైన్యం వశమైంది. మధ్యలో [[ససరాం]] నుండి వచ్చిన [[షేర్‌ షా సూరి]] ఆరేళ్ళు రాజ్యమేలినప్పుడు బీహార్ కొంత వైభవాన్ని మళ్ళీ చవిచూచింది. [[కలకత్తా]] నుండి [[పెషావర్]]([[పాకిస్తాన్]]) వరకు గ్రాండ్‌ట్రంక్ రోడ్డు ఆ కాలంలోనే వేయబడింది.
పంక్తి 48:
1557-1576 మధ్యకాలంలో [[అక్బర్]] చక్రవర్తి బీహార్, బెంగాల్‌లను ఆక్రమించి మొత్తాన్ని [[బెంగాల్]] పాలనలో కలిపాడు.[[ముఘల్]] సామ్రాజ్య పతనానంతరం బీహార్ క్రమంగా బెంగాల్ [[నవాబు]]ల అధీనంలోకి వెళ్ళింది.
 
=== ఆధునిక చరిత్ర ===
 
1765లో [[బక్సార]]్ యుద్ధము తర్వాత బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి బీహార్, బెంగాల్, ఒరిస్సాలపై దివానీ (పన్ను) అధికారం లభించింది. అప్పటినుండి 1912 వరకు బీహార్ ప్రాంతం బ్రిటిష్‌వారి బెంగాల్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది. 1912లో బీహార్‌ను వేరుచేశారు. 1935లో బీహారులో కొంతభాగాన్ని ఒరిస్సాగా ఏర్పరచారు. 2000లో బీహారులోని 18 జిల్లాలను వేరుచేసి ఝార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు.
పంక్తి 55:
1857 [[ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం]]లో [[ససరాం]]కు చెందిన [[బాబు కున్వర్ సింగ]]్, మరెందరో బీహార్ వీరులు ప్రముఖంగా పోరాడారు. తరువాత స్వాతంత్ర్యపోరాటంలో బీహారువారు ఘనంగా పాలు పంచుకొన్నారు. బీహారులోని [[చంపారణ్]] నీలి సత్యాగ్రహంతో భారతదేశంలో [[మహాత్మా గాంధీ]] నాయకత్వం అంకురించిందనిచెప్పవచ్చును. అప్పుడు సత్యాగ్రహానికి తోడు నిలిచిన [[డా.బాబూ రాజేంద్రప్రసాద్]] తరువాత మొదటి భారత [[రాష్ట్రపతి]] అయ్యాడు.
 
=== కాలరేఖ ===
 
* 560-480 BCE: [[బుద్ధుడు]]
* Before 325 BCE: [[మగధ]]లో నందుల రాజ్యము, [[వైశాలి]]లో [[లిచ్ఛవి]]రాజ్యము
* 325-185 BCE: [[మౌర్య వంశము]]
* 250 BCE: 3వ బౌద్ద సంఘము
* 185 BCE-80 CE: [[శుంగ వంశము]]
* 80 - 240: ప్రాంతీయ రాజ్యాలు
* [[240]] - [[600]]: [[గుప్త వంశము]]
* [[600]] - [[650]]: [[హర్ష వర్ధనుడు]]
* [[750]] - [[1200]]: [[పాల వంశము]]
* 1200: [[ముహమ్మద్ ఘోరీ]] సైన్యం చేత [[నలంద]], [[విక్రమశిల]] విద్యాలయాల నాశనం
* [[1200]]-[[1250]]:[[బౌద్ధ మతము]] క్షీణత
* [[1250]]-[[1526]]: [[ఢిల్లీ సుల్తానులు]]పాలన - టర్క్, తుఘ్లక్, సయ్యిద్, లోడీ సుల్తానులు
* [[1526]]-[[1540]]: [[బాబర్]]చేత ఢిల్లీ సుల్తానుల పరాజయం, [[ముఘల్ వంశముl]] ఆరంభం
* [[1540]]-[[1555]]: ముఘల్ రాజ్యాన్ని సూరి వంశము లోబరచుకొంది. షేర్‌షా సూరి ఈ వంశములోని వాడే.
* [[1526]]-[[1757]]: మళ్ళీ ముఘల్ పాలన మొదలు
* [[1757]]-[[1857]]: [[బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ]] పాలన
* [[1857]]: [[సైనిక తిరుగుబాటు]]
* [[1857]]-[[1947]]: [[బ్రిటిష్ రాజ్యము]] పాలన
* [[1912]]: బెంగాల్ నుండి బీహర్, ఒరిస్సాల విభజన
* [[1935]]: బీహార్‌నుండి ఒరిస్సా వేరు
* [[1947]]: భారత స్వాతంత్ర్యము, బీహారు రాష్ట్రం
* [[2000]]: దక్షిణ బీహారును వేరుచేసి ఝార్ఖండ్ రాష్ట్రంగా ఏర్పాటు.
 
== భౌగోళికం ==
 
బీహారు ఎక్కువ భాగం సారవంతమైన మైదాన ప్రాంతం. గంగ, శోణ, బాగమతి, కోసి, బుధి గండక్, ఫల్గు వంటి ఎన్నో నదుల బీహారు భూభాగంలో ప్రవహిస్తున్నాయి. దక్షిణ బీహారులో చిన్న కొండలున్నాయి.
 
 
== వాతావరణం ==
 
[[డిసెంబరు]], [[జనవరి]] మాసాలు [[చలికాలం]] ఉష్ణోగ్రతలు 5 నుండి 10 డిగ్రీలు [[సెల్సియస్]] వరకు నమోదవుతాయి. [[వేసవికాలం]] [[ఏప్రిల్]], [[మే]] లలో 40-45 డిగ్రీలవరకు వెళ్తుంది. [[జూన్]] నుండి [[సెప్టెంబరు]] వరకు [[వర్షాకాలం]].
 
== ఆర్ధిక వ్యవస్థ ==
 
 
పంక్తి 98:
 
 
== రాజకీయాలు ==
 
బీహారు శాసన, పాలనా విధానం అన్ని రాష్ట్రాలవలెనె ఉన్నది. - గవర్నరు, ముఖ్య మంత్రి, శాసన సభ, సివిల్ సర్వీసు, న్యాయ వ్యవస్థ వగయిరా.
పంక్తి 104:
దాదాపు దశాబ్దం పైగా బీహారు రాజకీయాలలో [[లాలూ ప్రసాద్ యాదవ్]] ప్రముఖ వ్యక్తిగా ఉంటూ వచ్చాడు.
 
== జిల్లాలు ==
{{:భారతదేశ జిల్లాల జాబితా/బీహార్}}
 
== ప్రయాణ,రవాణా సౌకర్యాలు ==
 
బీహారులో రెండు విమానాశ్రయాలున్నాయి. [[పాట్నా]], [[గయ]]
పంక్తి 115:
బీహారు రోడ్డు రవాణా వ్యవస్థ అంత బాగా లేదు. రోడ్లు బాగుండకపోవడం ఇందుకొక కారణం.
 
=== చూడదగినవి ===
 
* [[బౌద్ధ మతము|బౌద్ద]] క్షేత్రాలు - [[బోధ్ గయ]], [[నలంద]], [[రాజగిరి]].
* [[జైన మతము|జైన]] క్షేత్రాలు- [[వైశాలి]] and [[పవపురి]].
* [[సిక్ఖు మతము|సిక్ఖు]] క్షేత్రాలు- హర్‌మందిర్ సాహిబ్, పాట్నా ([[గురు గోబింద్ సింగ్]] జన్మస్థానం).
* [[హిందూ మతము|హిందూ]] క్షేత్రాలు - [[గయ]] (పిండదాన స్థలం), బైద్యనాథ ధామం, మహిసి తారామందిర్.
* [[ముస్లిం మతము|ముస్లిం]] క్షేత్రాలు - [[బిహార్-ఎ-షరీఫ్]]
* చారిత్రిక స్థలాలు - పైన చెప్పినవి మాత్రమే కాక, చంపారణ్, ససరాం మొదలైనవి
 
== సంస్కృతి ==
 
=== పండుగలు ===
 
అన్ని మతాలవారికి బీహారు నెలవైనట్లే అన్ని పండుగలూ జరుపబడతాయి.[[మకర సంక్రాంతి]], [[సరస్వతీ పూజ]] [[దసరా]], [[హోలీ]], [[ఈద్-ఉద్-ఫిత్రా]], [[ఈద్-ఉద్-జోహా]] ([[బక్రీద్]]), [[ముహర్రం]], [[శ్రీరామ నవమి]], [[రథయాత్ర]], [[రాఖీ]], [[మహాశివరాత్రి]], [[దీపావళి]], [[లక్ష్మీపూజ]], [[క్రిస్టమస్]], [[మహావీర జయంతి]], [[బుద్ధపూర్ణిమ]], ఇంకా అనేక జాతీయ, ప్రాంతీయ ఉత్సవాలు బీహారులో సంరంభంగా జరుపుకొంటారు
పంక్తి 133:
అయితే దీపావళి తరువాతి వారంలో వచ్చే [[ఛత్]] లేదా [[దలాఛత్]] పండుగ మాత్రం బీహారుకు ప్రత్యేకం, బీహారీలకు చాలా ముఖ్యం. ఇది [[సూర్యుడు|సూర్యుడిని]] ఆరాధించే పండుగ. ఈ ఆచారాన్ని వలస వెళ్ళిన బీహారీలు తమతో తీసుకెళ్ళినందున ఇప్పుడు దేశమంతటా ప్రధాన నగరాలలో ఛత్ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
 
=== జానపద గేయాలు, సంగీతం ===
 
బీహారులో గంగా మైదానంలో సంస్కృతి పురాతనమైనట్లే వారి [[జానపద సంగీతం]] చాలా పురాతనమైనది. ఎంతో వైవిధ్యము కలిగినది. జీవనంలో అన్ని సందర్భాలకూ, ఉత్సవాలకూ ఆయా విశిష్ట బాణీలలో జానపద గేయాలున్నాయి. ఇంకా హాస్యాన్నీ, ఆనందాన్నీ కలగలిపిన హోలీ పాటలు కూడా చాలా ఉన్నాయి.
పంక్తి 139:
19వ శతాబ్దంలో బ్రిటిష్‌వారి దుష్పాలన వల్ల, క్షీణించిన ఆర్ధిక గతివల్లా చాలామంది [[ఫిజీ]], [[మారిషస్]] వంటి పరదేశాలకు వలసపోయారు. అప్పటి చేదు పరిస్థితులకు అద్దం పట్టే విషాదపూరిత గేయాలూ, నాటికలూ కూడా చాలా జనప్రసిద్ధమైనాయి.
 
=== భాష, సాహిత్యం ===
 
బీహారులో హిందీ, [[ఉర్దూ]] మాత్రమే కాకుండా మరెన్నో స్థానిక భాషలున్నాయి. [[భోజపురి]], [[మైథిలి ]] , [[మాగహి]], [[ఆంగిక]] వంటివి. వీటిని కొంత వరకు హిందీ మాండలికాలని కూడా పరిగణిస్తూ ఉంటారు. వీటన్నింటినీ కలిపి [[బీహారీ భాష]] అని కూడా వ్యవహరిస్తుంటారు.
 
బీహారు నండి ఎందరో ప్రసిద్ధ కవులు, రచయితలు ఉన్నారు. [[రాజా రాధికా రమణ సింగ్]], [[శివ పూజన్ సహాయ్]], [[దివాకర ప్రసాద్ విద్యార్ధి]], [[నిరాలా]], [[రామ్ బిక్ష్ బేనిపురి]], [[దేవకీ నందన్ ఖత్రి]](చంద్ర కాంత నవలా రచయిత), [[విద్యాపతి]] (మైథలి భాషా రచయిత) వంటి వారు.
 
=== సినిమా ===
 
బీహారులో భోజపురి భాష సినిమా పరిశ్రమ బాగా వేళ్ళూనుకొంది. కొద్దిపాటి మైధిలి సినిమా పరిశ్రమ కూడా ఉన్నది.
 
== విద్య ==
 
ఒకప్పుడు విద్యలకు నిలయమై, ప్రపంచ స్థాయిలూ ఉండే నలందా, విక్రమశిల విశ్వవిద్యాలయాలు 13వ శతాబ్దంలో నాశనమయ్యాయి. తరువాత బీహారులో అంత గొప్ప విద్యాలయాలు వచ్చాయని చెప్పలేము. బీహారు జనాభాకు, మారుతున్నఅవసరాలకూ, ఆశయాలకూ అనుగుణమైన విద్యావకాశాలు బీహారులో అభివృద్ధి చెందలేదు.
పంక్తి 156:
 
 
=== బడులు ===
 
1980 దశకంలో చాలా ప్రైవేటు యాజమాన్పు స్కూళ్ళను ప్రభుత్వం అధినంలోకి తీసుకొన్నది. ఇవన్నీ బీహారు స్కూల్ ఎక్జామినేషను బోర్డు అధ్వర్యంలో నడుస్తాయి. ఇంకా వివిధ పాఠశాలలు [ICSE]], [[CBSE]] బోర్దులకు అనుబంధంగా ఉన్నాయి.
=== విశ్వ విద్యాలయాలు, కాలేజీలు ===
 
బీహారులో 5 విశ్వ విద్యాలయాలున్నాయి.
పంక్తి 173:
బీహారులో ప్రభుత్వాధీనంలో 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. - పాట్నా, భాగల్పూర్, ముజఫర్‌పూర్
 
== ఇవి కూడా చూడండి ==
* [[బీహార్ ముఖ్యమంత్రులు]]
 
== బయటి లంకెలు ==
 
* [http://bihar.nic.in/ Website of government of Bihar]
పంక్తి 191:
[[kn:ಬಿಹಾರ]]
[[ta:பீகார்]]
[[ml:ബീഹാര്‍ബിഹാർ]]
[[ace:Bihar]]
[[ang:Bihar]]
"https://te.wikipedia.org/wiki/బీహార్" నుండి వెలికితీశారు