నిరుద్యోగం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ta:வேலைவாய்ப்பின்மை
చి యంత్రము కలుపుతున్నది: ia:Desempleo; cosmetic changes
పంక్తి 1:
[[Fileఫైలు:World map of countries by rate of unemployment.png|thumb|350px|CIA figures for the latest [[List of countries by unemployment rate|world unemployment rates]]]]
[[నిరుద్యోగం]] ([[ఆంగ్లం]]: Unemployment) అనగా ఒక వ్యక్తి [[పని]] చేయగలిగి పనిని కాంక్షిస్తున్నప్పటికీ అతనికి పని దొరక్కపోవడం. ప్రపంచంలో అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి.
 
అమల్లో ఉన్న వేతనాలతో పనిచేయడానికి ఇష్టపడి కూడా [[ఉపాధి]] లభించని స్థితిని అనిచ్ఛాపూర్వక నిరుద్యోగమంటారు. ఉపాధి అవకాశాలు ఉండి తమకు తాము గా నిరుద్యోగులుగా ఉండే స్థితిని ఇచ్ఛా పూర్వక నిరుద్యోగమంటారు. పనిచేసే సామర్థ్యం ఉన్న వారందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తే దాన్ని సంపూర్ణ ఉద్యోగితా స్థాయి అంటారు.
 
సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగం సార్థక డిమాండ్ లోపించడం వల్ల, అంటే ఆర్థిక మాంధ్యం వల్ల ఏర్పడుతుంది. ఇలాంటి నిరుద్యోగం తాత్కాలికమైంది. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో నిరుద్యోగం వనరుల కొరత వల్ల ఏర్పడుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏర్పడే నిరుద్యోగం శాశ్వతమైనది.
== భారతదేశంలో ==
భారత్ లో నిరుద్యోగాన్ని ప్రధానంగా గ్రామీణ పేదరికం, పట్టణ పేదరికం అని రెండు రకాలుగా వర్గీకరించారు. గ్రామీణ పేదరికాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం, ఋతుసంబంధమైన నిరుద్యోగమని రెండు రకాలుగా విభజించవచ్చు. భారత్ లో వ్యవసాయ రంగంలో జనాభా ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల అవసరానికి మించిన శ్రామికులు ఆ రంగంలో పనిచేస్తున్నారు.
;ఋతుసంబంధమైన నిరుద్యోగిత:
భారతదేశంలో ఇప్పటికీ 60 శాతం వ్యవసాయం వర్షాధారమే కాబట్టి, వ్యవసాయ కూలీలకు సంవత్సరంలో 6 నుంచి 8 నెలలు మాత్రమే ఉపాధి అవకాశాలుంటాయి. మిగతా కాలమంతా ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండవు. వీరినే కాలీన నిరుద్యోగులు అంటారు.
;పట్టణ నిరుద్యోగిత:
* అల్పోద్యోగిత:పట్టబధ్రులైన యువకులకు తమ సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో ఉపాధి అవకాశాలుంటాయి. ఇలాంటి వారినే అల్పోద్యోగులు అంటారు. ఉదాహరణకు పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా ఉన్న యువకుడు గుమస్తాగా పని చేయడం
* ఒరిపిడి నిరుద్యోగం: ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న స్థితిలో సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం లేని కొందరు తాత్కాలికంగా ఉపాధి కోల్పోవడాన్ని ఒరిపిడి నిరుద్యోగం అంటారు.
* చక్రీయ నిరుద్యోగిత: అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాపార చక్రాల ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థలో మాంద్యం నెలకొనే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో తాత్కాలింగా ఏర్పడే నిరుద్యోగాన్ని చక్రీయ నిరుద్యోగం అంటారు.
* దీర్ఘ కాలిక నిరుద్యోగిత: దీన్నే సంస్థాగత లేదా ప్రత్యక్ష లేదా బహిరంగ నిరుద్యోగమని అంటారు. ఒక ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ప్రాధాన్యం నుంచి పారిశ్రామిక ప్రాధాన్యానికి మారే క్రమంలో పారిశ్రామిక రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి విరివిగా ఉపాధి అవకాశాలుంటాయి. అయితే అర్హత ఉన్న అభ్యర్థులకు కొరత ఉంటుంది. అర్హతలకు తగిన ఉపాధి అవకాశాలు లభించక అభ్యర్థులు నిరుద్యోగులుగా ఉంటారు.
 
== కారణాలు ==
# అల్పాభివృద్ధి రేటు
# జనాభా పెరుగుదల
# పురాతన వ్యవసాయ పద్దతులు
# పరిశ్రమల్లో వస్తువులు తయారు చేయడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం
# దిగుమతులపై నియంత్రణ విదించడం వల్ల పారిశ్రామిక ముడిపదార్థాలకు కొరత ఏర్పడడం
#అల్ప అల్ప వనరుల వినియోగం
# గ్రామీణ పారిశ్రామికీకరణ లోపించడం
# పట్టణీకరణ
# వస్తువుల తయారీలో శ్రమసాంద్ర పద్దతులు ఉపయోగించకపోవడం.
# తక్కువ పారిశ్రామికీకణ
# మౌలిక సదుపాయాల కొరత
# కుటీర పరిశ్రమలు క్షీణించడం
# ప్రాంతీయ ఆర్థిక అసమానతలు
# లోపభూయిష్టమైన సాంఘిక వ్యవస్థ
# లోపాలతో కూడిన విధానం
# అల్ప మూలధన కల్పన
# ఆర్థిక స్థోమత కేంద్రీకరణ
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
పంక్తి 65:
[[hr:Nezaposlenost]]
[[hu:Munkanélküliség]]
[[ia:Desempleo]]
[[id:Pengangguran]]
[[is:Atvinnuleysi]]
"https://te.wikipedia.org/wiki/నిరుద్యోగం" నుండి వెలికితీశారు