గజ్జి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
'''గజ్జి''' ([[ఆంగ్లం]]: Scabies) ఒక విధమైన [[పరాన్న జీవి]] వలన కలిగే [[అంటు వ్యాధి]]. ఇది [[చర్మం]]లో సొరంగాలు చేసి దాని మూలంగా విపరీతమైన [[దురద]], [[పుండ్లు]] మరియు [[వాపు]] కలుగుతుంది. ఈ పరాన్న జీవి పేరు "[[సార్కాప్టిస్ స్కేబీ]]" (Sarcoptes scabei). స్కేబీస్ అనే పదం [[లాటిన్]] ''స్కేబెర్'' అనగా గోకడం నుండి వచ్చింది.
 
==గజ్జి పరాన్నజీవి==
సార్కాప్టిస్ స్కేబీ కొన్ని జంతువులలో మరియు మనుషులలో గజ్జి వ్యాధిని కలుగజేస్తుంది. ఇవి ఒకవిధమైన పరాన్నజీవి కీటకాలు. ఇవి కంటికి కనిపించనంత సూక్ష్మంగా 0.3-0.4 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటాయి. ఇవి చర్మంలోని పల్చని పైపొర (స్ట్రేటమ్ కార్నియమ్) క్రిందనే ఉండి అక్కడ 2-3 మి.మీ. బొరియల్లాంటివి ఏర్పరచి వాటిలో గుడ్లు పెడుతుంది. చర్మంపై వీటి జీవిత చక్ర కాలం (life cycle) రెండు వారాలు మాత్రమే ఉండవచ్చును. స్కేబీస్‌తో బాధపడే వ్యక్తి శరీరంపై ఒక డజన్ కంటే ఎక్కువ ఈ విధమైన క్రిములు ఉండవు. అరుదుగా ఒక రకమైన నార్వీజియన్ స్కేబీస్ (Norwegian scabies) లో వీటి సంఖ్య లక్షల్లో ఉండవచ్చును. ఇవి ఎయిడ్స్, మధుమేహం మొదలైన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
 
==వ్యాధి లక్షణాలు==
[[చర్మం]] లోపలికి తొలుచుకుపోయి ఈ క్రిములు పెట్టే గ్రుడ్ల వలన చాలా తీవ్రమైన ఎలర్జీ సంభవిస్తుంది. కాని వీటి కారణంగా కలిగే తీవ్రమైన దురద కారణంగా చర్మాన్ని గోకడం వలన మరింత బాధ కలుగుతుంది. గోకడం వలన చర్మంపై బాక్టీరియా చేరి గజ్జికి కారణం అవుతుంది. ఈ క్రిములు పందులలో ఎక్కువగా ఉంటాయి.
 
==చికిత్స==
"https://te.wikipedia.org/wiki/గజ్జి" నుండి వెలికితీశారు