అట్లూరి పుండరీకాక్షయ్య: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం ప్రారంభం
 
→‎బాల్యం: విస్తరణ
పంక్తి 2:
 
==బాల్యం==
ఆయన కృష్ణా జిల్లా కైకలూరు దగ్గరున్న మెకాసా కలవపూడిలో ఆగస్టు 19, 1925 లో పుట్టాడు. ఐదవ తరగతి వరకు అక్కడే చదివాడు. తరువాత వాళ్ళ తండ్రి బెజవాడకు మకాం మార్చడంతో నాన్నకు సహాయంగా ఉండాలని 8వ తరగతితో చదువు ఆపేశాడు. ప్రహ్లాద సినిమాలో మొట్టమొదటిసారిగా నటించాడు. తరువాత వాళ్ళ మామయ్య రైస్ మిల్లులో అకౌంట్లను చూసే పనిలో కుదురుకుని అప్పుడప్పుడు నాటకాలు వేస్తుండేవాడు. అక్కడే ఎన్.టి.ఆర్ తో పరిచయం ఏర్పడింది. తరువాత రామారావు సినిమాల్లో వేషాలకోసం మద్రాసుకు వెళ్ళడంతో ఆయన తమ్ముడు త్రివిక్రమరావు తో కలిసి నేషనల్ ఆర్ట్స్ నిర్వహించేవాడు.
==సినిమా పరిచయం==
1951 లో రామారావు పిలుపు మేరకు మద్రాసుకు వెళ్ళాడు. అప్పటికే రామారావు నటుడిగా నిలదొక్కుకొని ఉన్నాడు. ఈయన్ను తీసుకెళ్ళి చక్రపాణి కి అప్పగించాడు. అలా విజయా సంస్థలో వంద రూపాయల జీతంతో పనిలో చేరాడు. ఒక రోజు రామారావు వచ్చి తను ఒక కంపెనీ ప్రారంభిస్తున్నాననీ, అందుకు ఆయన్ను ప్రొడక్షన్ కంట్రోలర్ గా ఉండమని కోరాడు.