యార్లగడ్డ లక్ష్మీప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
 
 
 
ప్రముఖరచయిత, ఆంధ్రప్రదేశ్‌ హిందీఅకాడమీ ఛైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ప్రతిష్ఠాత్మక సాహిత్యఅకాడమీ అవార్డు-2009కి ఎంపికయ్యారు. ఆయన రాసిన 'ద్రౌపది' తెలుగునవలకుగాను ఈ పురస్కారం వరించింది. బుధవారం ఢిల్లీలోని సాహిత్య అకాడమీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి అగ్రహారకృష్ణమూర్తి ఈ అవార్డుకు ఎంపికైనవారి వివరాలను ప్రకటించారు. లక్ష్మీప్రసాద్‌కు సాహిత్యఅకాడమీ అవార్డురావడం ఇది రెండోసారి. బిషన్‌సహానీ రాసిన'తామస్‌' అనే హిందీపుస్తకాన్ని తెలుగులోకి అనువదించినందుకు 1992లో ఆయన సాహిత్యఅకాడమీ అనువాద అవార్డును పొందారు. కాగా, ఈ దఫా ద్రౌపది పాత్రలో స్త్రీఔన్నత్యాన్ని విలక్షణంగా ఆవిష్కరించినందుకు సాహిత్య అకాడమీ సృజనాత్మక అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఒకేరచయిత రెండుసార్లు ఈ గౌరవాన్ని అందుకోవడం ఇదేతొలిసారి.
 
ఏ రంగంలో ఉన్నా తనదైన ముద్ర వేయడం ఆయన విధానం... బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం... రెండు భాషల్లో డాక్టరేట్లు... 45 పుస్తకాలు... అనేక అనువాదాలు... రెండుసార్లు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు... పద్మశ్రీ పురస్కారం... రాజ్యసభ సభ్యత్వం... హిందీ అకాడెమీ ఛైర్మన్‌ పదవి... స్వదేశంలోనూ, విదేశాల్లోనూ అనేక సాహితీ పురస్కారాలు... ఇన్ని సాధించడం ఆయనకే సాధ్యం. ఇంతగా ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయన సొంతం. ఆయనే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌. అందరూ ఆప్యాయంగా వైఎల్పీ అని పిలుచుకుంటారు. సాహితీ ప్రస్థానంలో ఆయనది అలుపెరుగని ప్రయాణం. పాండవ సతి 'ద్రౌపది' వ్యక్తిత్వాన్ని కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ ఆయన రాసిన పుస్తకం ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఆయన తన సాహితీ, రాజకీయ, ఉద్యోగ ప్రస్థానాన్ని 'న్యూస్‌టుడే' ఎదుట ఆవిష్కరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
 
నేనుగుడివాడ ఏఎన్‌ఆర్‌ కాలేజీలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు 17 ఏళ్ల వయస్సులో కాలేజీ మేగజైన్‌లో తొలి రచన ప్రచురితమైంది. అప్పటికే హిందీలో భాషా ప్రవీణ పూర్తి చేశాను. తెలుగు, హిందీ సాహిత్యాల మీద పట్టు ఉండేది. అప్పట్లో విజయవాడ ఆల్‌ ఇండియా రేడియలో వారం వారం మధువన్‌ అని ఒక కార్యక్రమం ఉండేది. ఏఐఆర్‌లో పని చేస్తున్న శంకరమంచి సత్యం, నండూరి సుబ్బారావు, సుమన్‌, ఉషశ్రీ నన్ను ఎంతో ప్రోత్సహించారు. తెలుగు రచయితలు, సాహిత్యంపై మధువన్‌లో రేడియో ప్రసంగాలు చేసేవాడిని. ఆ తర్వాత యువవాణిలో పలువురు హిందీ రచయితలపై తెలుగులోనూ ప్రసంగాలు చేశాను. ఆ ప్రసంగాలు సప్తస్వరాలు పేరుతో పుస్తకంగా వచ్చాయి. అప్పటి నుంచీ సాహితీ సేద్యం కొనసాగుతూనే ఉంది.
చిన్నతనంలోనే హిందీపై ప్రేమ
1930-40ల్లోనే మా అమ్మమ్మ టీచరుగా పనిచేశారు. పెద్దమ్మ హిందీ పండిట్‌. అమ్మ, నాన్న కూడా టీచర్లే. మా నాన్న దేశభక్తి పెంచేందుకు చిన్నప్పటి నుంచే హిందీ నేర్పడం మొదలు పెట్టారు. అలా సాహిత్యంతోనూ, హిందీతోనూ చిన్నప్పుడే అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత గుడివాడలో కొచ్చర్లకోట వెంకట సుబ్బారావు గారు, ఏఎన్‌ఆర్‌ కాలేజీలో బండ్లమూడి ఆంజనేయులుగారు హిందీలో నిష్ణాతుడిగా తీర్చిదిద్దారు. 1974లో ఏయూలో హిందీలో పీజీలో చేరాను.ప్రొఫెసర్‌ ఆదేశ్వర్రావుగారి సాంగత్యం నా జీవితాన్ని మలుపుతిప్పింది. బైరాగి కవిత్వాన్ని పరిచయం చేశారు. అక్కడి నుంచీ నాకు అదే లోకంగామారింది.
 
అనువాద రచనలతో జాతీయ సమైక్యత
ఇప్పటి వరకు 45 పుస్తకాలు రచించాను. రాసిన ప్రతీ పుస్తకమూ అచ్చయింది. వీటిలో ఎక్కువ అనువాదాలు, ప్రముఖుల జీవిత కథలే ఉన్నాయి. చాలా మంది అనువాదాన్ని చిన్న చూపు చూస్తారు. అది తప్పు. అనువాదం వల్లే జాతీయ సమైక్యత సాధ్యమవుతుంది. ఒక భాషా సమాజంలో వస్తున్న మార్పులు, కొత్త పరిణామాలు అనువాద రచనల వల్లే మరో భాష వాళ్లకు తెలుస్తాయి. ఆమాటకొస్తే తెలుగు సాహిత్యమే అనువాదంతో మొదలైంది. మహా భారతాన్నినన్నయ, తిక్కన, ఎర్రన ఆంధ్రీకరించడంతోనే అనువాదం మొదలైంది. విశ్వమానవ సౌభ్రాతృత్వానికి అనువాదం ఎంతో కీలకం. ప్రముఖుల గురించి భవిష్యత్‌ తరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఎక్కువగా వారి జీవిత గాథల రచనకు ప్రాధాన్యం ఇస్తాను.
 
మార్కెటింగ్‌ తెలియాలి..!
జనానికి ఏది కావాలో అది రాయాలి. అదే నా విజయ రహస్యం. 1992లో తమస్‌ టీవీ సీరియల్‌ దూరదర్శలో వస్తోంది. దాన్ని ఆపాలని హైదరాబాద్‌లో భాజపా వాళ్లు డీడీ కార్యాలయంపై దాడి చేశారు. తమస్‌లో ఏముందో తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి పెరిగింది.అప్పుడు ఢిల్లీలో ఉన్నాను. వెంటనే తమస్‌ రచయిత భీష్మ సహానీని కలసి తెలుగు అనువాదానికి అనుమతి తీసుకున్నాను. 22 రోజుల్లో పూర్తి చేసి ప్రచురించాను. నాలుగు ముద్రణలు వచ్చాయి. మన రచనల్ని ఎలా మార్కెటింగ్‌ చేసుకోవాలో కూడా తెలుసుండాలి. మానవీయ స్పృహ, మానవీయ స్పర్శ కూడా ఉండాలి. ద్రౌపది కూడా అంతే. ప్రముఖ మరాఠీరచయిత విష్ణు సుఖారామ్‌ యయాతి నవలను పాత్రల స్వీయానుభూతుల వ్యక్తీకరణ ద్వారా నడిపించిన తీరు నన్ను అబ్బురపరిచింది. అదే శైలిలో,నాకు ఇష్టమైన ద్రౌపది పాత్రను ఎవరూ చూడని కొత్త కోణంలో రాయడం వల్లే ఇంత పేరు వచ్చింది. అవార్డు లభించింది.
 
రాజకీయాల్లో తృప్తి లేదు
1972లో విద్యార్థి దశలోనే జైఆంధ్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్లాను. వెంకయ్యనాయుడు, హరిబాబులతో సాహచర్యం లభించింది. వారితో కలసి ముషీరాబాద్‌ జైల్లో ఒకే సెల్‌లో 45 రోజులున్నాను. అప్పుట్నుంచే పోరాట లక్షణాలు, రాజకీయాలపై ఆసక్తిఉన్నాయి. కానీ కోరి రాజకీయాల్లోకి రాలేదు. రాజ్యసభ సభ్యత్వం అనుకోని పరిణామం. రాజ్యసభలో ఉన్నప్పుడు మొదటి రెండేళ్లూ బాగానేగడిచింది. తర్వాతి నాలుగేళ్లూ జీవితం వ్యర్థంగా గడిచిపోతుందనిపించింది.నిర్మాణాత్మక చర్చలు ఉండేవికాదు. ఆందోళనలతోనే గడిచిపోయేది. మాట్లాడే అవకాశం వచ్చేది కాదు. పైగా రాజకీయాల్లో డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే ఇక అక్కడ ఇమడలేనిని పూర్తిగా దానికి స్వస్తి చెప్పేశాను.
 
బోధనలోనే తృప్తి..!
రాజ్యసభ సభ్యత్వం కంటే, ఢిల్లీలో ఉండి రాజకీయాలు నడపడం కంటే నాకు పాఠాలు చెప్పడంలోనే ఎంతో తృప్తి లభిస్తుంది. నా పాఠాలు విన్నప్పుడు పిల్లల కళ్లల్లో చూసిన సంతృప్తి ముందు ఏ పదవీ కొరగాదు. అయినా నాకు బోధన అంటే ప్రాణం. 17 ఏళ్ల వయస్సులో చదువకునేటప్పుడే పిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడిని. బోధన, చదవడం, రాయడం జీవితంలో ప్రధానమైన కార్యక్రమాలుగా చేసుకున్నాను. ఇక ముందూ అవే నా ప్రాధమ్యాలు.
 
చర్చ జరిగితేనే తత్వం బోధపడుతుంది
'ద్రౌపది' రచనపై చాలా విమర్శలు వచ్చాయి. వాటిని స్వాగతించాను. కొత్తదనం ఎప్పుడు వస్తున్నా చర్చ జరుగుతుంది. జరగాలి కూడా. అప్పుడే తత్వం బోధపడుతుంది. అందరూ తలూపేస్తే మజా ఏముంటుంది. ద్రౌపది రచనలో ఆమె తన భర్తలతో గడిపిన సందర్భంలో కొన్ని సన్నివేశాలను, చోటు చేసుకున్న సంభాషణలను నేనురాసిన తీరుని కొందరు ప్రశ్నించారు. అవి నీకు ఎలా తెలిశాయని కూడా అడిగారు. ఆయా పాత్రలు వివిధ సందర్భాల్లో ప్రవర్తించిన తీరుని నిశితంగా పరిశీలించి, వారి వ్యక్తిత్వాన్ని అవగాహన చేసుకుని ఆ రచయితగా నాకున్న స్వేచ్ఛను ఉపయోగించుకుని ఆ సన్నివేశాలు రూపొందించడం జరిగింది. నిజానికి ఈ విమర్శలు చేసిన వారికి భారతం పూర్తిగా తెలీదు. ధర్మరాజుని మెత్తని పులి అని తిక్కనే ఒక పద్యంలో అభివర్ణించాడు. అలా వివిధ పాత్రల వ్యక్తిత్వాలు అర్ధం చేసుకోవచ్చు.త్వరలో 'సత్యభామ' రచన అచ్చవుతుంది. కూచిపూడి భాగవతులు, మన సినిమా వాళ్లు సత్యభామను ఆభిజాత్యం, గర్వం కలిగిన స్త్రీగా చూపారు.కానీ నిజానికి కృష్ణుడుని అణువణువూ ఆరాధించిందీ, ప్రేమించిందీ ఆమే.ఆమె వ్యక్తిత్వాన్ని కొత్త కోణంలో చూపే ప్రయత్నమే 'సత్యభామ'.
 
నాది నిష్కామకర్మ
అవార్డులు వస్తాయని ఎప్పుడూ ఏ పనీ చేయలేదు. నా పని నేను చేసుకుంటూ వెళుతున్నానంతే. ఒక రచయితకు అనువాద రచనకూ, మౌలిక రచనకూ ఒక్కోసారి మాత్రమే సాహిత్య అకాడెమీ అవార్డు ఇస్తారు. ఆ రెండూ నాకు వచ్చాయి. జ్ఞానపీఠ్‌ అవార్డుని నేను ఆశించడం లేదు. నాకంటే అర్హులు 10-15 మంది ఉన్నారు. వారికి రావాలి. మనకు జ్ఞానపీఠ్‌ అవార్డు వచ్చి 20 ఏళ్లు అయిపోయింది. ఇప్పటికి ఇద్దరికి మాత్రమే వచ్చింది. అదే పొరుగునే ఉన్న కన్నడంలో ఏడెనిమిది మందికి వచ్చింది. తెలుగులో ఒక ప్రముఖ కవికి జ్ఞానపీఠ్‌ అవార్డు సాధించేందుకు నా ప్రయత్నం చేస్తున్నాను. తెలుగులో లబ్ధ ప్రతిష్ఠులైన సాహితీకారులకు లక్షల రూపాయల పురస్కారమైనా ఇవ్వలేమా అని బెజవాడ గోపాలరెడ్డి అనేవారు. ఆయన స్ఫూర్తితో లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ ప్రారంభించాను. ఏటా లక్ష రూపాయలపురస్కారం ఇస్తున్నాము. దాన్ని 1.25 లక్షలకు పెంచాం. త్వరలో రూ.2లక్షలు చేస్తాం. జనవరి 18న ఎన్‌టీఆర్‌, హరివంశరాయ్‌ బచ్చన్‌ వర్ధంతి రోజున ఏటా అవార్డులు ఇస్తున్నాం. ఈ కృషి కొనసాగుతుంది.
 
==పురస్కారాలు, పదవులు==