జ్యోతి బసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[పశ్చిమ బెంగాల్]] మాజీ ముఖ్యమంత్రి, దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన '''జ్యోతిబసు''' [[జూలై 8]], [[1914]]న [[కోల్కతా]]లో జన్మించాడు. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ కి చెందిన జ్యోతిబసు [[1977]] నుండి [[2000]] వరకు వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టినాడు. [[జనవరి 17]], [[2010]]న 96 సంవత్సరాల వయస్సులో మరణించాడు.
==బాల్యం==
జ్యోతిబసు జూలై 8, 1914న కోల్‌కతలో బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి నిశికాంత్ బసు వైద్యుడిగా పనిచేసేవాడు. తల్లి హేమలతా బసు. స్థానికంగా కలకత్తా (ఇప్పటి కోల్‌కత) లోనే జ్యోతిబసు విద్యాభ్యాసం కొనసాగింది. ఇతని అసలుపేరు జ్యోతికిరణ్ బసు కాగా పాఠశాల దశలో ఉన్నప్పుడు తండ్రి జ్యోతిబసుగా పేరును తగ్గించాడు. ప్రెసిడెన్సీ కళాశాల జ్యోతిబసు తన డిగ్రీ పూర్తిచేశాడు. ఉన్నత చదువుల కోసం 1935లో [[ఇంగ్లాండు]] బయలుదేరాడు. ఇంగ్లాండులో న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించుదశలోనే గ్రేట్బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడై రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాడు. 1940లో యాయశాస్త్రవిద్య పూర్తిచేసుకొని బారిస్టర్‌గా అర్హత పొందినాడు.
 
[[వర్గం:1914 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/జ్యోతి_బసు" నుండి వెలికితీశారు