|
|
===లేనిపోని తలనొప్పి===
అనవసర ఇబ్బందులు అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. తలనొప్పి వచ్చినప్పుడు దాన్ని ఎవరు అనుభవిస్తుంటే వారికి ఆ బాధ తెలుస్తుంది. ఆ బాధ వల్ల చేయాల్సిన ఇతర పనులేవీ సక్రమంగా జరుగవు. అలాంటి తలనొప్పిని ఎవరూ కావాలని తెచ్చుకోరు. ఎందుకంటే జరగాల్సిన పనులు జరుగవు కనుక. ఇక్కడ తలనొప్పి అనేది లక్ష్యసాధనకు అవరోధమన్నది భావంగా తీసుకోవడం వల్ల ఇదొక జాతీయమైంది. ఇబ్బందులను, అడ్డంకులను కోరి మరీ తెచ్చుకున్నట్టుగా ఎవరైనా ప్రవర్తించిన సందర్భంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. మనతోపాటు వాణ్ణి తీసుకువెళ్లడమంటే లేనిపోని తలనొప్పిని తెచ్చుకున్నట్టే అనేలాంటి సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.సందర్భం
===లొట్టలేయడం===
|