కాలాతీత వ్యక్తులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాలాతీత వ్యక్తులు''' డా. పి. శ్రీదేవి రచించిన తెలుగు [[నవల]]. ఈనాటి కాలంలో అనవసరమైన నియమాలను నిరసిస్తూ, పురుషాధిక్యతను ప్రతిఘటిస్తూ, తమపై అనేక రూపాల్లో జరుగుతున్న సామాజిక అత్యాచారాలపై పోరాడుతున స్త్రీశక్తి యొక్క ప్రారంభదశను 6వ దశాబ్దంలో రచయిత ఈ నవలలో ప్రదర్శించారు.
 
==పాత్రలు==
* ప్రకాశం - వైద్య విద్యార్ధి
* కృష్ణమూర్తి - ప్రకాశం స్నేహితుడు
* ఇందిర
 
==సంక్షిప్త కథాగమనం==
విశాఖపట్నంలో ఒక మేడపైనున్న గదిలో అద్దెకుంటున్న ప్రకాశం వైద్య విద్యార్ధి. కొన్నాళ్ళ క్రితం ఇందిర అనే వర్కింగ్ గర్ల్ తన తండ్రితో సహా క్రింది వాటాలో దిగింది. ఇందిర నాన్నగారు ఆనందరావుకు సుస్తీ చేస్తే ప్రకాశం ఆయనను కె.జి.హెచ్.లో అవసరమైన ప్రాథమిక చికిత్స చేయించాడు. అలా ప్రారంభమైన పరిచయంతో ఇందిర తండ్రి ఆరోగ్యం గురించి ఏదో అడగడానికని వచ్చి కబుర్లు పెట్టుకొని కదిలేది కాదు. రాత్రి గదికి తిరిగివచ్చిన ప్రకాశంతో పిచ్చాపాటీ మాట్లాడుతూ కూర్చుండిపోయేది. ఒక్కోసారి ఆమె రాకపోకలు చికాకు కలిగించేవి.
 
ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తికి చదువు తప్ప అన్నీ చేతనవగా బి.ఎ. పరీక్ష తప్పి చదువున్నాడు. ప్రకాశం కోసమని వచ్చిన కృష్ణమూర్తికి ఇందిర మెరుపుతీగలాగా కనిపించి పరిచయం చేసుకున్నాడు. పరిచయం అయినరోజునే ఇద్దరూ ప్రకాశం గదిలో ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్పుకున్నారు.
 
[[వర్గం:తెలుగు నవలలు]]
"https://te.wikipedia.org/wiki/కాలాతీత_వ్యక్తులు" నుండి వెలికితీశారు