కాలాతీత వ్యక్తులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తికి చదువు తప్ప అన్నీ చేతనవగా బి.ఎ. పరీక్ష తప్పి చదువున్నాడు. ప్రకాశం కోసమని వచ్చిన కృష్ణమూర్తికి ఇందిర మెరుపుతీగలాగా కనిపించి పరిచయం చేసుకున్నాడు. పరిచయం అయినరోజునే ఇద్దరూ ప్రకాశం గదిలో ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్పుకున్నారు. కృష్ణమూర్తికి జల్సాలకు డబ్బు ఖర్చుపెట్టడం సరదా, అమ్మాయిల మీద మోజు. ఇద్దరికీ చాలా విషయాల్లో శృతి కలిసి ఇద్దరూ బాగా తిరిగేవారు.
 
ఇందిర స్నేహితురాలు కళ్యాణి ఇంటర్ చదువుతున్నప్పటి క్లాస్ మేట్. పరిచయమైన తర్వాత ప్రకాశానికి ఆమె మీద అభిమానం కలిగింది. కళ్యాణి ఎవరితోనైనా మృదువుగా, వినయంగా మాట్లాడుతుంది. ఆమెతో మాట్లాడుతుంటే అతనికేదో ఓదార్పు, ఊరక కలిగేవి. ఇందిరకి టైఫాయిడ్ సోకగా ప్రకాశం ఆమెను కె.జి.హెచ్.లో చేర్పించాడు. కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆ నెలరోజులూ తనంటే ప్రకాశం పడిన ఆదుర్తా, చూపిన శ్రద్ధా కళ్యాణి హృదయాన్ని కృతజ్ఞతతో నింపివేశాయి. వీరిద్దరూ దగ్గరవడం ఇందిర సహించ లేకపోయింది. సూటిపోటి మాటలతో సున్నితమైన కళ్యాణి మనస్సును గాయపరిచింది. కళ్యాణి తల్లి ప్రేమ ఎరుగదు. ప్రకాశం చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాడు. వారిద్దరూ పరస్పరం బాధాకరమైన తమ కుటుంబ నేపథ్యాలను చెప్పుకొనేవారు. ఇంతలో కళ్యాణి తండ్రి చనిపోయాడు. ప్రకాశం దారిఖర్చులకు డబ్బిచ్చి చదువైపోయేదాకా సహాయపడతానని మాటిస్తాడు. రైల్లో క్లాస్ మేట్ వసుంధర పరిచయమై ఇందిర తన గురించి చెడు ప్రచారం గురించి తెలియజేస్తుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కాలాతీత_వ్యక్తులు" నుండి వెలికితీశారు