"ప్రదక్షిణము" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
'''ప్రదక్షిణము''' లేదా '''పరిక్రమము''' అనే దానికిపదానికి అర్ధం తిరగడం. [[హిందువులు]] [[దేవాలయం]]లోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట మరియు దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు. భగవదుపచారాల్లో ప్రదక్షిణ నమస్కారం చివరిది, పరిపూర్ణమైనది. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రాలు సూచిస్తాయి.
[[ఫైలు:Parikrama.jpg|right|thumb|200px|ఆలయం[[బోనాలు]] చుట్టూపండుగ సందర్భంగా ప్రదక్షిణం చేస్తున్న స్త్రీలు]]
==పద్ధతులు==
ఆలయాల్లో చేసే ప్రదక్షిణల్లో చాలా రకాలున్నాయి. మామూలుగా [[ధ్వజస్తంభం]] నుంచి ప్రారంభించి తిరిగి చివరకు బలిపీఠం (ధ్వజస్తంభం) వద్దకు చేరుకుని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణ క్రమం. చండీశ్వరుడున్న [[శివాలయం]] లో ప్రదక్షిణ విధానం మరొక పద్ధతిలో ఉంటుంది. దానికి ''చండీ ప్రదక్షిణం'' అని పేరు. ఇంట్లో పూజల సందర్భంలో ఆత్మ ప్రదక్షిణ చేయాలి. గుడులలో ఆత్మ ప్రదక్షిణ చేయరాదు. <ref>సెప్టెంబర్ 6, ఆదివారం 2009 ఈనాడు దినపత్రిక సామవేదం షణ్ముఖ శర్మ రాసిన అంతర్యామి శీర్షికలో రాసిన ''ప్రదక్షిణలో పరమార్థం'' అనే వ్యాసం ఆధారంగా... </ref>.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/488772" నుండి వెలికితీశారు