కేథలిక్ బైబిల్ గ్రంధాలు: కూర్పుల మధ్య తేడాలు

పేజీలోని సమాచారాన్నంతటినీ తీసేస్తున్నారు
చి 117.195.211.118 (చర్చ) చేసిన మార్పులను, Wutsje వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 1:
{{శుద్ధి}}
 
 
[[బైబిల్]] అనేది కొన్ని గ్రంథాల కలయిక. ఇందులో [[పాత నిబంధన]] మరియు [[క్రొత్త నిబంధన]] అనేవి ప్రధాన భాగాలు. వీటిలో, ప్రధానంగా పాతనిబంధనకు చెందిన భాగంలో కొన్ని గ్రంధాలు లభ్యం కాలేదు. లేదా లభ్యమైన వాటిని మతాధికారులు ప్రామాణికంగా అంగీకరించలేదు. ఇలాంటివాటిని "ఆమోదింప బడనివి" లేదా "తొక్కిపెట్టబడినవి" లేదా "నిరాకరింపబడినవి" అని అనవచ్చును. దొరికిన గ్రంథాలు గుహలు, పురాతన గ్రంథాలయాలు, తవ్వకాలలో బయటపడ్డాయి. అవి పురాతన గ్రంథాలయాలలో మూల పడేయబడ్డాయి లేదా పురాతన చర్చిలలో నేల కింద పాతి పెట్ట బడ్డాయి. ఇలాంటి గ్రంథాలను ఆంగ్లంలో [[:en:Biblical apocrypha|Biblical apocrypha]] అని అంటారు. [[:en:Apocrypha]] అనే గ్రీకు మూల పదానికి "దాచబడినవి" అని అర్ధం. ఇలా కొన్ని బైబిల్ గ్రంధాల కర్తృత్వాన్ని లేదా దివ్యత్వాన్ని వివిధ మతాధికారులు సంశయిస్తున్నారు లేదా నిరాకరిస్తున్నారు. వాటిని "బిబ్లికల్ అపోక్రైఫా" అని, లేదా సూక్ష్మంగా "అపోక్రైఫా" అని కూడా అంటారు. ఈ పదాన్ని తిరస్కార పూర్వకంగాను లేదా వివాదాస్పదంగాను వాడడం కద్దు. ఈ "నిరాకరణ" విషయంలో [[కేథలిక్కు]] మరియు [[ప్రొటెస్టంటు]] సంప్రదాయాలలో విభేదాలున్నాయి. క్రైస్తవ మతాధికారులచే ఇవి పాక్షికముగా లేదా పూర్తిగా లభ్యమైనా కొన్ని పూర్తిగా కనుమరుగు చెయ్యబడ్డాయి అని కూడా ఒక భావన ఉంది.
కేథలిక్కు బైబిల్ లో అదనంగా ఉన్నగ్రంధాలు: 7 వీటిని దైవావేశితంకావనే కారణం చెబుతూ ప్రొటెస్టంటులు అంగీకరించరు.
#తోబితు
#యూదితు
#మక్కబీయులు 1
#మక్కబీయులు 2
#[[జ్ఞాన గ్రంథము|సొలోమోను జ్ఞానగ్రంథము]]
#సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము
#బారూకు
 
==మరియ మగ్దలీన ==
'''మరియ మగ్దలీన''' (Mary Magdalene) ఏసు క్రీస్తు శిష్యురాలు మరియు సన్యాసిని. ఈమెకు ఏసు క్రీస్తుతో పెళ్ళయినదని [[ఫిలిప్ సువార్త]]లో వ్రాయబడినది. ఈమె పాలస్తీనాలోని మగ్దలా గ్రామానికి చెందినది.
 
 
== హనోకు గ్రంథము==
క్రైస్తవులు తొక్కిపెట్టిన అనేక బైబిల్ గ్రంథములలో హనోకు గ్రంథము (Book of Enoch) ఒకటి. ఇది [[అమ్హరిక్]] భాషలో వ్రాయబడినది. దీన్ని ఇథియోపియా ఆర్థొడాక్స్ సంఘము వాళ్ళు మాత్రమే ప్రామాణిక గ్రంథముగా నమ్ముతారు. చాలా క్రైస్తవ శాఖల వాళ్ళు దీన్ని అప్రామాణిక గ్రంథముగా కొట్టి పారేసినప్పట్టికీ, యూదా ఉత్తరములో దీన్ని ప్రామాణిక గ్రంథముగా పేర్కొనడం జరిగింది.
 
==ఏలియా దర్శనములు==
 
ఏలియా దర్శనములు (Apocalypse of Elijah) క్రైస్తవులు తొక్కిపెట్టిన గ్రంథములలో ఒకటి. ఈ గ్రంథము ఎవరు వ్రాశారు అన్న ప్రశ్న ఇప్పటికీ వివాదాస్పదముగా ఉంది. ఈ గ్రంథాన్ని కాప్టిక్ భాషలోనూ మరియు హీబ్రూ భాషలోనూ వ్రాయడం జరిగింది.
 
==జ్ఞాన గ్రంథము==
జ్ఞాన గ్రంథము (Book of Wisdom) క్రైస్తవులు తొక్కి పెట్టిన అనేక గ్రంథాలలో ఒకటి, ఆ గ్రంథ రచయిత పేరు ఆ గ్రంథములో ఎక్కడా పేర్కొనలేదు కానీ ఆ గ్రంథమును సోలోమోను రాజు వ్రాసినట్టు భావించడం జరిగింది. ఈ పుస్తకం గ్రీకు భాషలో వ్రాయబడినది. పండితుల అభిప్రాయం ప్రకారం ఈ గ్రంథం క్రీస్తు పూర్వం ఒకటవ లేదా రెండవ శతాబ్దంలో వ్రాయబడినది.
 
==ఫిలిప్ సువార్త==
 
క్రైస్తవులు తొక్కిపెట్టిన అనేక బైబిల్ గ్రంథములలో ఫిలిప్ సువార్త ఒకటి. క్రైస్తవులు ఏసు క్రీస్తు పరిశుద్ధ పురుషడని, అందుకే పెళ్ళి కూడా చేసుకోలేదని నమ్ముతారు. కానీ ఫిలిప్ సువార్తలో ఏసు క్రీస్తుకి [[మరియ మగ్దలీన]] అనే శిష్యురాలితో పెళ్ళి అయినట్టు వ్రాసి ఉంది. అందుకే ఆ సువార్తని తొక్కిపెట్టడం జరిగింది. ఆ సువార్త ఆధారంగా తీసిన "డా విన్సీ కోడ్" అనే సినిమాను కొన్ని క్రైస్తవ దేశాలలో నిషేధించడం జరిగింది.
 
 
యేసు ఈ లోకమునకు వచ్చినది లోకములోని పాపములను తీసుకొని పోవుటకు, ఆత్మసమర్పణం కావించుటకే వచ్చియున్నాడని, దానిని సిలువతో నెరవేర్చి శిలువ మీద చివరి మాటగా "సమాప్తమైనది" అని పలికినాడని బైబిలులోని నాలుగు సువార్తలు రూఢి చేస్తున్నవి. ఐతే ఆధునిక కాలంలోని కాల్పనిక కథలు యేసు సిలువ పైనుండి దిగివచ్చినట్లు పారిపోయినట్లు చెబుతున్నవి. సువార్తలు వ్రాయబడిన కాలం మొదటి శతాబ్దమైతే, చాలామటుకు విమర్శకులు 20వ శతాబ్దపు పూర్వభాగంలోని వారు.
 
==అరబ్బీయుల బాల్య సువార్త==
క్రైస్తవులు తొక్కిపెట్టిన అనేక సువార్తలలో అరబ్బీయుల బాల్య సువార్త (Arabic Infancy Gospel) ఒకటి. ఏసు క్రీస్తు బాల్యం గురించి సిరియాక్ బాషలో ఒక సువార్త వ్రాయబడినది. దాన్ని అరబిక్ బాషలోకి అనువదించడం జరిగింది. కానీ దాన్ని క్రైస్తవ చర్చిలు తొక్కిపెట్టినాయి. ఆ సువార్తలో ఎముందో పూర్తిగా తెలియరావడం లేదు కానీ అందులోని కొన్ని భాగాలు [[ఖురాన్]]లో చేర్చబడ్డాయి.{{fact|ఆధారం కోరబడినది}}
 
==బర్నబాస్ సువార్త==
క్రైస్తవులు తొక్కిపెట్టిన అనేక గ్రంథాలలో బర్నబాస్ సువార్త ఒకటి. బర్నబాస్ సువార్త ప్రకారం క్రీస్తు దేవుడు కాదు, దేవుని బిడ్డ కాదు. అతను ఒక ప్రవక్త మాత్రమే. ఇలా రాసినందుకే క్రైస్తవ మతాధికారులు బర్నబాస్ సువార్తను తొక్కిపెట్టారు. క్రీస్తు తరువాత మరొక ప్రవక్త వస్తాడని బర్నబాస్ సువార్తలో వ్రాయబడినది. దీన్ని క్రైస్తవులు ఎలాగూ నమ్మరు కానీ ముస్లింలు నమ్ముతారు. ముస్లింల నమ్మకం ప్రకారం ముహమ్మదే చివరి ప్రవక్త, ఏసు క్రీస్తు (ఈసా అల్ మసీహ్) రెండవ గొప్ప ప్రవక్త. ఒకప్పుడు ఈజిప్ట్ దేశములో క్రైస్తవులు బర్నబాస్ సువార్తని ప్రామాణిక సువార్తగా నమ్మేవారు కానీ 325 C.E. తరువాత క్రైస్తవ మతాధికారులు దాన్ని తొక్కిపెట్టడం జరిగింది. ఇప్పుడు కొందరు ఇస్లామిక్ పండితులు మాత్రమే బర్నబాస్ సువార్తని ప్రామాణిక సువార్తగా భావిస్తున్నారు. వారిలో ప్రముఖులు [[అబుల్ అలా మౌదూదీ]] మరియు [[రషీద్ రీదా]] . [[పౌలు]] ను [[పేతురు]] కు పరిచయం చేసింది, తన యావదాస్తిని అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర ప్రజా వినియోగానికై పెట్టిన మొదటి వ్యక్తి [[బర్నబాస్]] .
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
*[http://www.islam101.com/religions/christianity/christ_islam.html islam101.comలో క్రీస్తు మరియు క్రైస్తవ మతం పై ఒక వ్యాసం]
*[http://barnabas.net/how-the-gospel-of-barnabas-survived.html బర్నబాస్ సువార్తని బతికించినది ఎవరు?]
*[http://cmi.irib.ir/messiah/ బర్నబాస్ సువార్త ఆధారముగా తీసిన ఇరానీ సినిమా]
 
 
 
 
[[వర్గం:ఆమోదింపబడని బైబిల్ గ్రంధములు]]
 
[[en:Biblical apocrypha]]
[[de:Apokryphen]]
[[fr:Apocryphes (Bible)]]