తుంగభద్ర నది పుష్కరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Tungabhadramma.JPG|right|thumb|250px|<center>[[తుంగభద్ర నది]] పుష్కరాల సమయంలో ప్రతిష్టించిన తుంగభద్రమ్మ విగ్రహం</center>]]
[[ఫైలు:Tungabhadra Pushkaram 05.JPG|right|thumb|250px|<center>[[2008]]లో జరిగిన[[తుంగభద్ర నది]] పుష్కరాలలో [[మహబూబ్ నగర్]] జిల్లా [[ఆలంపూర్]] వద్ద నదిలో స్నానం చేస్తున్న భక్తులు</center>]]
[[ఫైలు:Tungabhadra Pushkaram 04.JPG|right|thumb|250px|<center>[[తుంగభద్ర]] నది పుష్కర సమయంలోని దృశ్యం</center>]]
[[బృహస్పతి]] మకరరాశిలో ప్రవేశించునప్పుడు తుంగభద్రనది పుష్కరాలు నిర్వహిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తుంగభద్ర నది పుష్కరాలు [[2008]], [[డిసెంబర్ 10]]న ప్రారంభమై 12 రోజుల పాటు జరిగాయి. తుంగ మరియు భద్ర రెండు నదుల కలయిక వలన [[కర్ణాటక]]లో పుట్టిన తుంగభద్రనది [[ఆంధ్ర ప్రదేశ్]] లో ప్రవేశించి [[కర్నూలు]] మరియు [[మహబూబ్ నగర్]] జిల్లా సరిహద్దుల గుండా ప్రవహించి [[ఆలంపూర్]] సమీపంలోని సంగమేశ్వరం వద్ద [[కృష్ణానది]]లో సంగమిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర పుష్కరాలను నిర్వహించడం ఇది తొలిసారి. ఈ నది ఆంధ్రప్రదేశ్‌లో రెండే జిల్లాల నుండి ప్రవహిస్తుంది కాబట్టి రెండు జిల్లాలలో ఉన్న తుంగభద్ర తీరప్రాంతాలలో స్నానఘాట్లను ఏర్పాటుచేసి జిల్లా యంత్రాంగం 12 రోజుల పాటు యాత్రికులకు సౌకర్యాలు కలుగజేసింది.