వి.వి.యెస్.లక్ష్మణ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:വി.വി.എസ്. ലക്ഷ്മൺ
చి యంత్రము కలుపుతున్నది: ta:வி. வி. எஸ். லட்சுமண்; cosmetic changes
పంక్తి 39:
 
== కెరీర్ ఆరంభము ==
[[1996]] సంవత్సరంలో [[దక్షిణాప్రికా]] జట్టుతో [[అహ్మదాబాదు]]లో ఆడిన [[టెస్ట్]] [[క్రికెట్ట్]] మ్యాచ్ లొ యాభై పరుగులు చేసి అరంగ్రేట్రం చేశాడు. కాని తరువాత లక్ష్మణ్ భారత అంతర్జాతీయ జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు. [[1997]] సంవత్సరంలో [[దకిణాప్రికా]]తో ఓపెనింగ్ చేయడానికి పంపబడ్డాడు, కాని విఫలం అయ్యాడు. ఇలా మూడు సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్టులో స్థానం స్థిరంగా నిలుపుకోలేకపోయాడు. జనవరి [[2000]] సంవత్సరంలో భారత్ ఆస్ట్రేలియాకు జరిగిన సీరిస్ లో [[ఆస్ట్రేలియా]] జట్టుతో [[సిడ్నీ]]లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో 167 పరుగులు చేసి తన సత్తా చూపాడు.
 
== లక్ష్మణ్ అత్యుత్తమ ప్రదర్శనలు ==
లక్ష్మణ్ ఆట తీరు నాటకీయం గా ఈ సిరీస్ లో మారిపోయింది, [[ముంబయి]] లో జరిగిన మొదటి టెస్ట్ లో లక్ష్మణ్ 20 మరియు 12 పరుగు లు చేసాడు. [[సచిన్ టెండుల్కర్]] మినహా మిగతా అందరూ సరిగా ఆడలేకపోయారు. భారత్ ఈ టెస్ట్ లో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయినా తరువాత [[2001]] లో జరిగిన [[కలకత్తా]]లో జరిగిన రెండవ టెస్ట్ లో అత్యంత ఒత్తిడి లో [[ఆస్ట్రేలియా]] పైన ఫాలోఆన్ ఆడుతూ అసాధారణ రీతి లో 281 పరుగులు చేయడము లక్ష్మణ్ కు పేరుప్రఖ్యాతలు తెచ్చింది. ఈ క్రమం లో అతడు చాలా కాలం క్రితం [[సునీల్ గవాస్కర్]] సాధించిన 236(నాటౌట్) పరుగుల రికార్డును అధిగమించాడు.<ref>http://ind.cricinfo.com/db/ARCHIVE/2000-01/AUS_IN_IND/SCORECARDS/AUS_IND_T2_11-15MAR2001.html</ref> [[వీరేంద్ర సెహ్వాగ్]] [[2004]] లో [[పాకిస్తాన్]] తో [[ముల్తాన్]] లో 309 పరుగులు చేసేవరకు ఈ రికార్డు పదిలంగా కొనసాగింది. కలకత్తా లో జరిగిన ఈ టెస్ట్‌లో రాహుల్ ద్రావిడ్‌తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యము సాధించాడు. లక్ష్మణ్ ఈ ఇన్నింగ్స్ మంచి పరిణామానికి దారి తీసింది. అంతకు ముందు టెస్టును ఇన్నింగ్స్ తేడా తో ఓడిపోయినప్పటికి మిగిలిన 2 టెస్టులు గెలిచి స్టీవ్ వా యొక్క " చివరి సరిహద్దు" కలను వమ్ము చేసాడు. ప్రదర్శన భారత క్రికెట్ లో ఒక ఇతిహాసం గా నిలిచిపోయింది. ప్రపంచంలోని అత్యద్బుత ప్రదర్శన లలో ఆరవది గా విజ్డన్ పత్రిక గుర్తించింది.<ref>http://in.rediff.com/cricket/2001/jul/30bat100.htm</ref> తర్వాత కొన్ని సంవత్సరాలు లక్ష్మణ్ స్థానము ఒక రోజు పోటీ లకు, టెస్ట్ లకు పదిలం చేసుకున్నాడు. తర్వాత అతను తన ఆట తీరును ఇండియా ఆస్ట్రేలియా పర్యటన వరకు కొనసాగించాడు. ఇక్కడ అతను మూడు వన్డే , రెండు టెస్టు శతకాలు సాధించాడు. అతడు ఆస్ట్రేలియా పైన [[అడిలైడ్]] లో 148 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో [[రాహుల్ ద్రవిడ్]] తో మరోసారి 300 పరుగుల భాగస్వామ్యము సాధించాడు. రెండు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా పై వారి సొంత గడ్డ పై గెలవడానికి ఈ ఇన్నింగ్స్ ఉపయోగపడింది. అతను [[సిడ్నీ]] టెస్ట్ లో 178 పరగులు చేసి సచిన్ తో కలిసి మరోసారి 300 పరుగుల భాగస్వామ్యము సాధించాడు.ఈ కారణము వలన [[ఇయాన్ చాపెల్]] లక్ష్మణ్ ను " చాలా చాలా ప్రత్యేకమైన లక్ష్మణ్ ( very very special laxman ) అని వర్ణించాడు.
 
== ఇటీవలి ఆటతీరు ==
కాని లక్ష్మణ్ ఆటతీరు ఆస్ట్రేలియా పర్యటన నుండి తగ్గుతూ వచ్చింది. [[2004]] [[మార్చి]] లో పాకిస్తాన్ పర్యటన నుండి [[జింబాబ్వే]]( ఐసిసి ర్యాంకింగ్స్ లో చివరి స్థానం లో ఉన్న దేశము) తో సాధించిన ఒక సెంచరీ తో సహా కేవలము మూడు సెంచరీలు మాత్రమే సాధించాడు. అతను తన [[2004]] లో అభిమాన ఆస్ట్రేలియా తో మన దేం లో జరిగిన సీరీస్ లో ముంబయి లో జరిగిన టెస్ట్ లో 69 పరుగులు సాధించినా చాలా తడబడ్డాడు. ఆ టెస్ట్ భారత్ గెలిచినప్పటికి సిరీస్ కోల్పోయింది. ముంబయి లో మార్చ్ [[2006]] లో [[ఇంగ్లాండు]] తో మొదటి టెస్ట్ లో లక్ష్మణ్ సున్నా పరుగులు చేసి స్థానము కోల్పోయాడు. తిరిగి గాయము కారణము గా సచిన్ గైర్హాజరీ కారణము గా [[వెస్టిండీస్]] పర్యటన లో స్థానము సాధించి మూడవ టెస్ట్ లో శతకము సాధించాడు. [[గ్రెగ్ ఛాపెల్]] [[2005]] లో కోచ్ గా వచ్చిన తర్వాత లక్ష్మణ్ యొక్క నాశిరకం ఫీల్డింగ్, అతని ఆటతీరు వన్డే లకు సరిపోకపోవడం వలన వన్డే ల నుండి తొలగింపబడ్డాడు. ఇది 2004 మొదట్లో ఆస్ట్రేలియా,పాకిస్తాన్ లతో 14 గేములలో 4 శతకాలు, ఆస్ట్రేలియా తో ఒకే వారము లో విబి సీరీస్ లో సాధించిన 3 సెంచరీలు కలుపుకుని, మరుగునపరిచింది. [[నవంబరు]] [[2006]] లో గంగూలీ తో పాటు లక్ష్మణ్ కూడా దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. లక్ష్మణ్ [[ఫిబ్రవరి]] [[2004]] లో జి.ఆర్.శైలజను వివాహమాడెను.
== ఇండియన్ ప్రీమియర్ లీగ్ ==
[[2008]] సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ దక్కన్ చార్జర్స్ కు నేతృత్వం వహించాడు. కాని ట్వంటీ-20 ఆటలో తన బ్యాంటింగ్ తీరులో కాని, నాయకత్వం కాని చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సీజన్ పూర్తి కాకుండానే తన నాయకత్వ బాధ్యతలను వైస్ కెప్టెన్ [[ఆడం గిల్‌క్రిస్ట్]] కు అప్పగించాల్సి వచ్చింది. చివరికి దక్కన్ చార్జర్స్ చివరి నుంచి రెండో స్థానం మాత్రమే పొందగలిగింది. [[2009]] సీజన్ ఐ.పి.ఎల్. కొరకు ఏకంగా లక్ష్మణ్‌ను నాయకత్వ బాధ్యతలనుంచి తొలిగించి ఆడం గిల్‌క్రిస్ట్‌కు కట్టబెట్టారు.<ref>సాక్షి దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ29, తేది 30.09.2008.</ref> ఆస్ట్రేలియా జట్టుపై మంచి రికార్డు ఉన్న లక్ష్మణ్‌ను ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటన ముందు తప్పించడం, ఆస్ట్రేలియాకు చెందిన డారెన్ లీమన్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించగానే దక్కన్ చార్జర్స్ ఈ నిర్ణయం తీసుకొనడం లక్ష్మణ్ ఆత్మ విశ్వాసం దెబ్బతీసేందుకేనని అనుమానాలకు తావిస్తోంది. <ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 14, తేది 30.09.2008.</ref>
 
== బయటి లింకులు ==
# [http://ind.cricinfo.com/db/PLAYERS/IND/L/LAXMAN_VVS_06003317/ క్రిక్‌ఇన్ఫో ప్లేయర్ ప్రొఫైల్ : వంగివరపు వెంకటసాయి లక్ష్మణ్]
== మూలాలు ==
<references/>
 
పంక్తి 64:
 
[[en:V. V. S. Laxman]]
[[ta:வி. வி. எஸ். லட்சுமண்]]
[[ml:വി.വി.എസ്. ലക്ഷ്മൺ]]
[[bn:ভিভিএস লক্ষ্মণ]]
"https://te.wikipedia.org/wiki/వి.వి.యెస్.లక్ష్మణ్" నుండి వెలికితీశారు