యాచకులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దానం]] ఇమ్మని అర్ధించేవారిని యాచకులు బిక్షగాళ్ళు అంటారు. ఢిల్లీలో 60 వేల మంది భిక్షగాళ్ళున్నారట.వచ్చే ఏడాది కామన్ వెల్త్ ఆటల పోటీల ప్రారంభం నాటికి దేశ రాజధానిలో యాచకులెవరూ కనిపించకుండా చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం 1959నాటి బాంబే భిక్షాటన నిషేధ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేయనున్నారు. యాచకులు కనిపించిన వెంటనే అక్కడికక్కడే విచారించి శిక్షలు విధించేందుకు సంచార న్యాయస్థానాలను ప్రారంభించారు. పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. పునరావాస చర్యల్లో భాగంగా నగరంలో ఇప్పటికే 11 భిక్షాటకుల గృహాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చీల ప్రాంగణాల్లో యాచకులను అనుమతించవద్దని ఆయా మత పెద్దలను సంక్షేమ శాఖ అధికారులు కోరారు. ఢిల్లీని యాచకులు లేని నగరంగా మార్చాలని హైకోర్టు ఆగస్టు 10న ఉత్తర్వుల్లో సూచించింది.<ref> http://www.eenadu.net/story.asp?qry1=33&reccount=36</ref> ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిచ్చమెత్తుకునే పిల్లలకు చదువు వసతి కల్పించాలని మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీర్మానించారు.<ref>http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=309493&Categoryid=1&subcatid=33</ref>
==పసికందులతో భిక్షాటన==
కొందరు కనుగుడ్త్డెనా తెరవని పసికందులను చూపి, వారి పోషణ పేరుతో 'భిక్షాటన వ్యాపారం' చేస్తుండగా మరికొందరు మహిళలు చింకిగుడ్డలను ఉపయోగించి వాటిని శిశువుల్లాగా భ్రమింపజేసి, పసిపిల్లకు పాలు లేవు ధర్మం చేయండంటూ ప్రజలను మోసగిస్తున్నారు! పిల్లలను చూపి యాచన చేస్తున్న వారు వారిని తల్లిదండ్రుల నుంచి రోజుకు రూ.150 నుంచి రూ.200 చొప్పున 'అద్దె'కు తెచ్చుకుంటున్నారు. మధ్యలో లేచి ఏడ్చి, తమ ఆర్జనకు ఆటంకం కాగూడదన్న ఉద్దేశంతో ముక్కుపచ్చలారని చిన్నారులకు నల్లమందు వంటి మత్తుమందులను ఇచ్చి, వారు నిద్ర లేవకుండా చేస్తున్నారు.శిశువులతో భిక్షాటన చేసే వారు తారసపడితే వెంటనే 1098 (ఛైల్డ్‌ లైన్‌)కు ఫోన్‌ చేస్తే ఆ చిన్నారులను రక్షించి వారికి అవసరమైన సంరక్షణ కల్పిస్తారు.మన రాష్ట్రంలో చైల్డ్ లైన్లు హైదరాబాద్,విజయవాడ,విశాఖపట్నం,ఏలూరు లలో ఉన్నాయి.ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ అనే స్వచ్చందసంస్థద్వారా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ వీటిని నిర్వహిస్తోంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/యాచకులు" నుండి వెలికితీశారు