పంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ): కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: fr:Panchayat raj
పంక్తి 2:
==పంచాయితీల చరిత్ర==
ప్రాచీనకాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన [[వృత్తి|వృత్తుల]] ప్రతినిధులతో పనిచేశేవి. అయితే ఇవి ఎక్కువగా అణచివేతకు గురయ్యేవి. బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ [[రిప్పన్]] ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919 మరియు 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి.
==ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పాలన==
కరణం మునసబు పటేల్ పట్వారీ లను 1985 లో తీసేసి గ్రామపాలనాధికారుల్ని (వి.ఏ.వో ) ప్రవేశపెట్టారు.పంచాయతీల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో 2007 ఫిబ్రవరి నుంచి వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది. 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10,000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి వీ.ఆర్.వో లు ఉండడానికి అనుమతి ఇచ్చారు. కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్)గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లు ఉండగా 17,008 వీఆర్వోలు అవసరం. ప్రస్తుతం సుమారు 14,800 మంది వీఆర్వోలే ఉన్నారురాష్ట్రంలోని 21,943 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక కార్యదర్శి ఉండాలి. ప్రతి పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. ఒక కార్యదర్శికి ఒక పెద్ద పంచాయతీ లేదా ఏడు చిన్నపంచాయతీల బాధ్యతలను అప్పగించారు.మన రాష్ట్రంలో 1127 రెవిన్యూ మండలాలు,1094 మండలపరిషత్తులు,21943 గ్రామపంచాయితీలు,28124 రెవిన్యూ గ్రామాలు,26614 నివాసితగ్రామాలు,1510 నివాసులులేనిగ్రామాలు ఉన్నాయి.
పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థ ఇకపై నాలుగు అంచెలుగా మారనుంది. ప్రథమశ్రేణి కార్యనిర్వహణాధికారులు, గ్రామాభివృద్ధి అధికారులు, ద్వితీయశ్రేణి కార్యనిర్వహణాధికారులను గ్రేడ్‌-1గా పరిగణిస్తారు. ద్వితీయశ్రేణి గ్రామాధికారులను గ్రేడ్‌-2గాను, దిగువశ్రేణి సహాయకులను గ్రేడ్‌-3గాను, అంతకన్నా కిందిస్థాయి సిబ్బందిని గ్రేడ్‌-4గా గుర్తిస్తారు. పంచాయతీల వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు, ఆపై ఆదాయం ఉన్న పంచాయతీకి గ్రేడ్‌-1, 5 నుంచి 10 లక్షల రూపాయల వార్షికాదాయం ఉన్న పంచాయతీలకు గ్రేడ్‌-2; 2 నుంచి 5 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాటికి గ్రేడ్‌-3; లక్ష రూపాయల నుంచి 2 లక్షల వరకు ఆదాయం ఉన్న పంచాయతీలకు గ్రేడ్‌-4 అధికారులను నియమిస్తారు.
 
==గ్రామ సభ==
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం గ్రామ సభలను మరింత క్రియాశీలం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ప్రభుత్వ పథకాలు, విధానాలు, కార్యక్రమాల విషయంలో తాము నిర్వహించాల్సిన పాత్ర ఏమిటో వాటికి విడమరిచి చెప్పాలని సూచించింది. సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శుల బాధ్యతలు, పాత్రను కూడా రాష్ట్రాలు విస్పష్టంగా నిర్వచించాలని చెప్పింది. స్థానిక ఒత్తిళ్లనుంచి వారు రక్షణ పొందేలా విధివిధానాలను నిర్దిష్టంగా పేర్కొనాలని సలహా ఇచ్చింది.గ్రామసభలను గ్రామీణాభివృద్ధికి వేదికలుగా తీర్చిదిద్దాలని సూచించింది. దీర్ఘకాల అభివృద్ధి లక్ష్యాలు, సామాజిక భద్రత, లింగ వివక్ష, పౌష్టికాహారం, వ్యవసాయం, ఆదాయవృద్ధి, మౌలికవసతులు వంటి అన్ని అంశాలపైనా గ్రామసభలు చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపింది.(ఈనాడు21.10.2009)