కలంకారీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[బొమ్మ:Gita-kalamkari-painting.JPG|right|250px|thumb|గీతోపదేశం బాగా జనప్రియమైన చిత్రం. ఇది [[కలంకారీ]] శైలిలో వస్త్రంపై అద్దిన చిత్రం.]]
'''కలంకారీ''' అనగా వెదురుతో చేసిన [[కలం]]తో సహజమైన [[రంగు]]లను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక [[కళ.]] ఇది [[చిత్తూరు]] జిల్లా [[శ్రీకాళహస్తి]]లో పుట్టింది. పురాతన [[హరప్పా నాగరికత]]కు సంబంధించిన త్రవ్వకాలలో లభించిన ఒక వెండి పాత్ర మీద చిత్రాలు ఉన్న ఒక వస్త్రం ఆధారంగా కలంకారీ కళ చాలా ప్రాచీనమైనదని తెలుస్తోంది. బౌద్ధ ఆరామాలు కూడా ఈ కలంకారీ వస్త్రాలతో అలంకరించే వారు. [[అలెగ్జాండర్]] కూడా కలంకారీ వస్త్రాలను తనతోపాటు తీసుకువెళ్ళాడంటారు. <ref>{{cite web|url= http://www.aponline.gov.in/Quick%20links/HIST-CULT/arts_kalamkari.html
|title= ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైటు నుంచి }}</ref>కారీ అనగా [[హిందీ]] లేదా [[ఉర్దూ]]లో పని అని అర్థం. 10వ శతాబ్దంలో పర్షియన్ మరియు భారతీయ వర్తకుల సంబంధాల నేపథ్యం నుంచి ఈ పదం ఉద్భవించి ఉండవచ్చు.<ref>{{cite web|url =http://www.kalamkariart.org/index.php?id=2&type=txt|title= కలంకారీ ఆర్ట్.ఆర్గ్ వెబ్ సైటు నుంచి}}</ref> ఐరోపా వర్తకులు కూడా ఇలాంటి వస్త్రాలపై చిత్రించే కళను వేరే పేర్లతో పిలుస్తుంటారు. ఉదాహరణకు [[పోర్చుగీసు]] వారు దీనిని '''పింటాడో''' అని అంటారు. డచ్చి వారు '''సిట్జ్ ''' అనీ బ్రిటీష్ వారు '''షింజ్''' అనీ పిలుస్తారు. కృష్ణా జిల్లా [[పెడన]]లో దీన్ని బ్లాక్ ప్రింటింగ్ పిలుస్తారు. ప్రస్తుతం మనం చూసే బ్లాక్ ప్రింటింగ్సు ''పెడన'' నుండి వస్తుంటే దేవతా చిత్రాలు (హస్త కళలు) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాలో [[ఆర్యవటం]]లో కూడా కొంతమంది పెడన తరహాలోన బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు.
==చరిత్ర==
 
 
ఈ కళ శ్రీకాళహస్తిలో ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేయడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఉన్న ఆధారాలను బట్టి, 13 మరియు 19వ శతాబ్దాల్లో కోరమాండల్ తీరం వెంబడి వస్త్ర వ్యాపారం బాగా జరిగేది. కాబట్టి దక్కను పీఠభూమికి చెందిన అన్ని ప్రదేశాలలోనూ ఈ కళ విలసిల్లిందని తెలుస్తుంది. పట్టణాన్ని ఆనుకుని ఎల్లప్పుడూ ప్రవహించే [[సువర్ణముఖి|సువర్ణముఖీ]] నదిలో ఈ కళకు ముఖ్యంగా అవసరమైన స్వచ్ఛమైన పారే నీరు లభించటం వలన ఇది ఇక్కడ బాగా ప్రాచుర్యం పొంది ఉండవచ్చు. ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తేశ్వరాలయం పర్యాటకులను, యాత్రుకులను ఆకర్షించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఈ కళ ఎక్కువగా హిందూ సాంప్రదాయాన్నే ప్రతిబింబిస్తుంది. ఇక్కడగల కళాకారులు ఇప్పటికీ [[రామాయణము]], [[మహాభారతం]], [[శివ పురాణం]] మొదలైన వాటిని నుంచి పాత్రలను చిత్రిస్తూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/కలంకారీ" నుండి వెలికితీశారు