సిరివెన్నెల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
ఈ సినిమా కధ ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్ (బెనర్జీ) మరియు మూగదైన చిత్రకారిణి ([[సుహాసిని]]) చుట్టూ తిరుగుతుంది. విశ్వనాథ్ దీనిని తన సినిమాలలో ఒక సవాలుగా భావించారు.
 
తెలుగు సినీ జగత్తులో కళాఖండంగా నిలిచిన ఈ చిత్రం లోని పాటలన్నీ చిరకాలం గుర్తుండిపోయే స్ధాయిలో ఉంటాయి. [[సిరివెన్నెల సీతారామశాస్త్రి | సీతారామశాస్త్రి]] ఈ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి, ఈ సినిమా పేరునే ఇంటి పేరు గా నిలుపుకున్నారు. [[కె.వి.మహదేవన్]] సంగీతంతో పాటు ప్రఖ్యాత వేణువాద విద్వాంసుడు [[హరిప్రసాద్ చౌరాసియా]] తన వేణు నాదాన్ని అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓంకార సంబందమున్న '''విధాత తలపున ప్రభవించినది...''' అనే గీతంలో సాహిత్యం పలువురి ప్రశంసలు పొందింది. ఈ సినిమాలోని ఇతర పాటలలో '''చందమామ రావే జాబిల్లి రావే ...''', '''ఆది భిక్షువు వాడినేమి కోరేదీ, బూడదిచ్చే వాడినేమి అడిగేదీ''', '''ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు''', '''మెరిసే తారలదే రూపం''' తదితర గీతాలు విశేషంగా అలరించాయి. ముఖ్యంగా "చందమామ రావే" పాటలో అంధ బాలికకు చంద్రదర్శనం చేయించినట్లుగా చిత్రీకరించిన తీరు కళాతపస్వి దర్శకత్వ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఆలాగే '''ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలు''' పాట చిత్రీకరణ కూడా అంతే స్ధాయిలో ఉంటుంది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సిరివెన్నెల" నుండి వెలికితీశారు