ఎలగందల్ ఖిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ఎలగందల్ ఖిల్లా
(తేడా లేదు)

15:02, 21 మార్చి 2010 నాటి కూర్పు

ఎలగందల్ ఖిల్లా

ఖిల్లాలోని మసీదు

ఎలగందల్ గ్రామం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వం ఐదుగురు రాజవంశీయులు పరిపాలించారు. వారు కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొగలులు, ఆసఫ్ జాహీలు. ఇక్కడ ఓ పురాతనమైన కోట (ఖిల్లా) ఉంది. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. ఈ గ్రామం లోనే ఇంకో చివర "దో మినార్ "అనే కట్టడం ఉంది.