ప్రకాష్ ఆమ్టే: కూర్పుల మధ్య తేడాలు

చి డా.ప్రకాష్ ఆమ్టే చిత్రం
చి లోక్ బిరాదరి ప్రకల్ప్- లింకు
పంక్తి 3:
[[File:LBP Gate 6 x 4.JPG|200px|right|thumb|<center>లోక్ బిరదారీ ప్రకల్ప్</center>]]
[[ప్రకాష్ ఆమ్టే]] [[మహారాష్ట్ర]] కు చెందిన ఒక వైద్యుడు మరియు సుప్రసిద్ధ సంఘ సేవకుడు. జీవన సహచరియైన మందాకిని తో కలిపి సంయుక్తంగా [[2008]]లో [[రామన్ మెగసెసే పురస్కారం|రామన్ మెగసెసే అవార్డు]] పొందాడు. <ref>http://timesofindia.indiatimes.com/Cities/Magsaysay_Award_for_Baba_Amtes_son/articleshow/3312446.cms</ref> <ref>http://www.rmaf.org.ph/Awardees/Citation/CitationAmtes.html</ref> ఈయన తండ్రి [[బాబా ఆమ్టే]] కూడా సంఘసేవలో మెగసెసే అవార్డును పొందాడు. తండ్రి స్థాపించిన [[లోక్ బిరదారీ ప్రకల్ప్]] అనే సంస్థను సేవా వారసత్వంగా స్వీకరించాడు. [[మడియా గోండులు]] అనే ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపిన సంస్థ ఇది. ప్రకాష్ చిన్నప్పటి నుంచి తండ్రి [[కుష్టు వ్యాధి|కుష్టు రోగుల]] కోసం స్థాపించిన పునరావాస కేంద్రమైన ''ఆనంద వనం'' అనే ఆశ్రమంలో పెరిగాడు. [[1974]]లో ప్రకాష్ నాగ్పూర్ లో ఉన్నత వైద్య విద్య నభ్యసిస్తున్నపుడు మడియా గోండుల జీవితాలలో వెలుగును నింపడం కోసం తండ్రి ఒక పథకాన్ని ప్రారంభించాడు. తండ్రి నుంచి అరుదైన సేవా వారసత్వాన్ని పుచ్చుకొన్న ప్రకాష్ తన భార్య మందాకినితో కలిసి మారు ఆలోచన లేకుండా అప్పటిదాకా పట్టణాల్లో నిర్వహిస్తున్న తమ వైద్య సేవలను విడిచిపెట్టి ఎక్కడో మారుమూలన ఉన్న హేమల్ కాసా కు పయనమయ్యారు. [[మహారాష్ట్ర]]లోని గఢ్ చిరోలి జిల్లాలో "హేమల్ కసా" అనే గిరిజన గ్రామం దట్టమైన [[అడవి]]లో ఉంది. అక్కడే ఆ డాక్టర్ దంపతులు [[1974]]లో , రెండు గుడిసెలు వేసుకొని వైద్యాన్ని ప్రారంభించారు. ఇప్పుడీ వైద్యశాలను (లోక్ బిరాదరి హాస్పిటల్) ఏడాదిలో సుమారు 40,000 మంది రోగులు సందర్శిస్తుంటారు.
[[http://viswiki.com/en/Lok_Biradari_Prakalpలోక్ బిరాదరి ప్రకల్ప్]]
 
==సేవా భాగ్యం==
అప్పటి దాకా సకల సౌకర్యాలతో పట్టణంలో జీవించిన యువ దంపతులు ఒక్కసారిగా [[విద్యుత్తు]], [[టెలిఫోన్]], సౌకర్యాలు లేని ఒక తలుపు లేని గుడిసె లోకి మారారు. రోడ్డు పక్కనే వైద్య సేవలు చేసేవారు. రాత్రివేళ చలి వేస్తే కట్టెలతో మంట వేసుకుని చలి కాసుకునే వారు. గోండులు కొత్తవాళ్ళని అసలు నమ్మేవారు కాదు. నాగరికులంటే వారికి అకారణమైన భయం. దానికి తోడు వాళ్ళ మాట్లాడుకునే మడీయా భాషకు లిపి లేదు. ఈ భాషకు హిందీ, మరాఠీ భాషకు పోలికే లేదు. కొన్ని పదాలను మాత్రం తెలుగు భాషనుంచి అరువు తెచ్చుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాకాలం నుంచి పని చేస్తున్న అటవీ శాఖ ఉద్యోగుల సాయంతో లోక్ బిరదారీ ప్రకల్ప్ కార్యకర్తలు కొన్ని పదాలు నేర్చుకున్నారు. అవి వారితో మాటలు కలపడానికైతే సరిపోయాయి గానీ వారి మనసులు గెలవడం మాత్రం కుదరలేదు.
"https://te.wikipedia.org/wiki/ప్రకాష్_ఆమ్టే" నుండి వెలికితీశారు