సోమవరప్పాడు (తాళ్ళూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
'''సోమవరప్పాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[తాళ్ళూరు]] మండలానికి చెందిన గ్రామము. చాలా పురాతనమైన ఈ గ్రామము పాత దర్శి తాలూకాలో చాలా ప్రాముఖ్యము కలిగి ఉన్నది. దాదాపు దర్శి తాలూకాలోని చాలా గ్రామాలలోని సమస్యలు ఇచటనే పరిష్కరించబడేవి. ఈ గ్రామము చాలా పెద్ద రెవెన్యూ ఏరియా కలిగివుండి, జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుంటి గంగ దేవాలయముతో పాటు, ఆంజనేయస్వామి ఆలయము మరియు రామాలయము కూడా కలిగి ఉన్నది. ప్రతి సంవత్సరము చైత్రమాసంలో [[పౌర్ణమి]] తర్వాత రెండవ రోజు అతి వైభవంగా గంటిగంగ తిరునాళ్ళు జరుగుతాయి. ఈ దేవాలయాన్ని కీ.శే.పోగుల యల్లమందయ్య ( గ్రామ మున్సబ్ ) కట్టంచినాడు. తదుపరి వారికుమారుడు కీ.శే.శ్రీ పోగుల రామబ్రహ్మం మరియు కుటుంబ సభ్యులందరు కలిసి ఆలయ జీర్ణోద్ధరణ గావించినారు. కీ.శే. మామిడి వెంకట సుబ్బయ్య ప్రజల సహకారంతో రామాలయ జీర్ణోద్ధరణ గావించినాడు.
ఎక్కడా లేనివిధంగా ఈ క్షేత్రములో ప్రతి కులానికి ఒక అన్నదాన సత్రము వున్నది. తిరునాళ్ళు జరిగే 3 రోజులు ఎంతమందికైనా లేదనకుండా భోజనవసతి కల్పించబడుచున్నది.
 
ఈ గ్రామముతో కలిపి కట్టబడిన తూర్పు గంగవరం గ్రామము దిన దినాభివృద్ధి చెంది ప్రస్తుతము వ్యాపారపరంగాను, రాజకీయంగాను చాలా కీలకమైనదిగా ఉన్నది. ఈ పంచాయితీలోని సోమవరప్పాడు గ్రామము అద్దంకి అసెంబ్లీ మరియు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోను, తూర్పు గంగవరం మాత్రము దర్శి అసంబ్లీ మరియు నరసరావుపేట పార్లమెంటు నియోకవర్గం పరిధిలోను ఉన్నాయి. ఇటీవల తూర్పు గంగవరం గ్రామంతోపాటు ఈగ్రామముకూడా దర్శి నియోజకవర్గములో కలపడం జరిగింది.