యాచకులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దానం]] ఇమ్మని అర్ధించేవారిని యాచకులు [[బిక్షగాళ్ళు]] [[అడుక్కునేవాళ్ళు]] అంటారు. ఢిల్లీలో 60 వేల మంది భిక్షగాళ్ళున్నారట.వచ్చే ఏడాది కామన్ వెల్త్ ఆటల పోటీల ప్రారంభం నాటికి దేశ రాజధానిలో యాచకులెవరూ కనిపించకుండా చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం 1959నాటి బాంబే భిక్షాటన నిషేధ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేయనున్నారు. యాచకులు కనిపించిన వెంటనే అక్కడికక్కడే విచారించి శిక్షలు విధించేందుకు సంచార న్యాయస్థానాలను ప్రారంభించారు. పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. పునరావాస చర్యల్లో భాగంగా నగరంలో ఇప్పటికే 11 భిక్షాటకుల గృహాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చీల ప్రాంగణాల్లో యాచకులను అనుమతించవద్దని ఆయా మత పెద్దలను సంక్షేమ శాఖ అధికారులు కోరారు. ఢిల్లీని యాచకులు లేని నగరంగా మార్చాలని హైకోర్టు ఆగస్టు 10న ఉత్తర్వుల్లో సూచించింది.<ref> http://www.eenadu.net/story.asp?qry1
=33&reccount=36</ref> ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బిచ్చమెత్తుకునే పిల్లలకు చదువు వసతి కల్పించాలని మన రాష్ట్ర అసెంబ్లీలోరాష్ట్రంలో కూడా తీర్మానించారు.<ref>http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=309493&Categoryid=1&subcatid=33</ref>
బహిరంగ ప్రదేశాల్లో జరిగే భిక్షాటనను ప్రభుత్వం నేరంగా ప్రకటించింది. జనసమ్మర్థమున్న ప్రాంతాల్లో ఇకపై భిక్షాటన చేస్తే అరెస్టు చేయాలని నిర్ణయించింది. యాచకులు (బెగ్గర్స్‌) లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో 1977 ప్రివెన్షన్‌ ఆఫ్‌ బెగ్గింగ్‌ యాక్ట్‌ కింద సాంఘిక సంక్షేమశాఖ ఈ ఉత్తర్వులిచ్చింది.జనాలు ఎక్కువగా ఉన్న చోట భిక్షాటన చేస్తూ కనిపిస్తే వారెంటు లేకుండా అరెస్టు చేస్తారు. తరువాత 24 గంటల్లోగా కోర్టుకు హాజరు పరుస్తారు. యాచకుడు తాను ఎందుకు భిక్షాటన చేస్తున్నదీ, అంగవైకల్యం ఉన్నదీ లేనిదీ, అన్నీ కోర్టుకు వివరించుకోవాల్సి ఉంటుంది.అనంతరం కోర్టు ఆదేశాల మేరకు వారిని ప్రత్యేక హోమ్‌లకు తరలించి వసతులు కల్పించాలి.అరెస్టు చేసిన వారికి పునరావాసం లేదా ఆశ్రయం కల్పించడం కోసం సాంఘిక సంక్షేమశాఖ నుంచి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి.ఆశ్రయం కల్పిస్తున్న సంస్థల్లో చిన్న పిల్లలకైతే చదువు, పెద్దవారికైతే వృత్తిపరమైన శిక్షణ ఇచ్చేందుకు కూడా వసతులు కల్పించాలి. ఎవరైనా యాచక వృత్తి చేస్తూ పట్టుబడి, మార్పు చెంది తిరిగి ఆ వృత్తి చేయకుండా సాధారణ జీవితాన్ని గడిపేందుకు ముందుకొస్తే, కోర్టు అనుమతి ద్వారా ఆ వ్యక్తిని విడుదల చేయవచ్చు.యాచక వృత్తిని నిరోధించడంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి. చీఫ్‌ సెక్రటరీ చైర్మన్‌గా పనిచేసే రాష్ట్ర కమిటీ 6 నెలలకోసారి దీనిపై సమీక్ష జరిపి చట్టం అమలు ఎలా ఉందో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.
==పసికందులతో భిక్షాటన==
కొందరు కనుగుడ్త్డెనా తెరవని పసికందులను చూపి, వారి పోషణ పేరుతో 'భిక్షాటన వ్యాపారం' చేస్తుండగా మరికొందరు మహిళలు చింకిగుడ్డలను ఉపయోగించి వాటిని శిశువుల్లాగా భ్రమింపజేసి, పసిపిల్లకు పాలు లేవు ధర్మం చేయండంటూ ప్రజలను మోసగిస్తున్నారు! పిల్లలను చూపి యాచన చేస్తున్న వారు వారిని తల్లిదండ్రుల నుంచి రోజుకు రూ.150 నుంచి రూ.200 చొప్పున 'అద్దె'కు తెచ్చుకుంటున్నారు. మధ్యలో లేచి ఏడ్చి, తమ ఆర్జనకు ఆటంకం కాగూడదన్న ఉద్దేశంతో ముక్కుపచ్చలారని చిన్నారులకు నల్లమందు వంటి మత్తుమందులను ఇచ్చి, వారు నిద్ర లేవకుండా చేస్తున్నారు.శిశువులతో భిక్షాటన చేసే వారు తారసపడితే వెంటనే 1098 (ఛైల్డ్‌ లైన్‌)కు ఫోన్‌ చేస్తే ఆ చిన్నారులను రక్షించి వారికి అవసరమైన సంరక్షణ కల్పిస్తారు.మన రాష్ట్రంలో చైల్డ్ లైన్లు హైదరాబాద్,విజయవాడ,విశాఖపట్నం,ఏలూరు లలో ఉన్నాయి.ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ అనే స్వచ్చందసంస్థద్వారా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ వీటిని నిర్వహిస్తోంది.
"https://te.wikipedia.org/wiki/యాచకులు" నుండి వెలికితీశారు