గోరు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ht:Zong
విస్తరణ
పంక్తి 3:
'''గోరు''' లేదా '''నఖం''' (Nails) కాలి మరియు చేతి వేళ్ళకు చివర భాగం నుండి పెరిగే [[కొమ్ము]] (Horn) వంటి గట్టి నిర్మాణాలు. గోర్లు కెరటిన్ (Keratin) అనే ప్రోటీన్ తో చేయబడివుంటాయి.
[[ఫైలు:Fingernails1.JPG|thumb|చేతి వేళ్ళు.]]
మాతృగర్భంలో ఆకృతి దాల్చుకున్న పిండం 9వ వారంలోనే గోళ్లకు అంకురాలు పడతాయి. 15వ వారానికల్లా గోళ్ల పెరుగుదల ఆరంభమవుతుంది. ఇక అక్కడి నుంచీ జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈ పెరుగుదల పసిబిడ్డల్లో నెమ్మదిగా మొదలై వయసుతో పాటు క్రమేపీ వేగం పుంజుకుంటుంది. ఈ వేగం 20ల్లో, 30ల్లో అత్యధికంగా ఉంటుంది, 50ల తర్వాత ఒక్కసారిగా నెమ్మదిస్తుంది.
 
* కాలి గోళ్ల కన్నా చేతిగోళ్లు త్వరగా పెరుగుతాయి. కాలి గోళ్లు నెలకు 1 మిల్లీ మీటరు పెరిగితే చేతిగోళ్లు 3 మిల్లీ మీటర్ల వరకూ పెరగొచ్చు. చేతిగోరు మొదలు నుంచి చివరి వరకూ పెరగటానికి 100-180 రోజులు పడుతుంది, కాలిగోరు 12-18 నెలలు తీసుకుంటుంది.
* పోషకాహార లోపం, శారీరక వ్యాధులు, కాళ్లూ చేతులకు రక్తనాళ సమస్యల వల్ల గోళ్ల పెరుగుదలలో వేగం తగ్గొచ్చు. క్యాన్సర్‌ మందులతోనూ వేగం తగ్గొచ్చు.
* గర్భిణులకు, సోరియాసిస్‌ బాధితులకు వేగంగా పెరుగుతాయి.
[[ఫైలు:Toes.jpg|thumb|కాలి వేళ్ళు.]]
 
"https://te.wikipedia.org/wiki/గోరు" నుండి వెలికితీశారు