హంఫ్రీ డేవీ: కూర్పుల మధ్య తేడాలు

vistarana
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
డేవీ ఇంగ్లండు కు చెందిన కార్న్‌వాల్ అనే కౌంటీ లో జన్మించాడు. ఒక మందులమ్మే ఆయన, ఒక వైద్యుడి దగ్గర అప్రెంటీస్ గా పని చేస్తూ [[రసాయన శాస్త్రం]] పై మక్కువ పెంచుకున్నాడు. 1799 లో బ్రిస్టన్ లోని న్యూమాటిక్ ఇన్‌స్టిట్యూట్ లో సహాయకుడుగా పని చేస్తూనే [[నైట్రస్ ఆక్సైడ్]] యొక్క లక్షణాలను గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు కనుగొన్నాడు. దీంతో ఆయన్ను 23 సంవత్సరాల వయసులోనే గ్రేట్ బ్రిటన్ లోని రాయల్ ఇన్‌స్టిట్యూషన్ వారు రసాయన శాస్త్ర ఆచార్యులుగా నియమించుకున్నారు.
 
డేవీ కున్న అధ్బుతమైన బోధనా నైపుణ్యం, శాస్త్ర పరిశోధనలో ఆయనకున్న ట్రాక్ రికార్డులు వెరసి ఆయన్ను తన సమకాలికుల్లో అగ్రస్థానాన్ని కట్టబెట్టాయి. ఆ రోజుల్లో బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు రెండూ శత్రువులైనప్పటికీ 1808 లో ఫ్రెంచి ఇన్‌స్టిట్యూట్ వారి ఆయనకు నెపోలియన్ ప్రైజును బహూకరించారు. 1812 లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను సర్ బిరుదుతో సత్కరించింది. 1818 లో ఇంకా ఉన్నతమైన బారోనెట్ తో సత్కరించింది. 1820 లో ఆయన రాయల్ సొసైటీకి అధ్యక్షుడయ్యాడు.
 
[[Image:Davy lamp.png|thumb|150px|left|The Davy lamp]]
"https://te.wikipedia.org/wiki/హంఫ్రీ_డేవీ" నుండి వెలికితీశారు