"చక్రవర్తి రాజగోపాలాచారి" కూర్పుల మధ్య తేడాలు

vistarana
(vistarana)
}}
'''రాజాజీ'''గా ప్రసిద్ధుడైన '''చక్రవర్తి రాజగోపాలాచారి''' (Chakravarthi Rajagopalachari) స్వతంత్ర సమరయోధుడు మరియు రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు రెండవ మరియు చివరి గవర్నర్ జనరల్. ఆయన సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారమైన [[భారతరత్న]]ను పొందిన తొలివ్యక్తులలో ఒకడు (1954లో). రాజాజీ [[తమిళనాడు]] రాష్ట్రములోని [[సేలం]] జిల్లా, [[తోరపల్లి]] గ్రామములో [[1878]], [[డిసెంబర్ 10]]న జన్మించాడు.
 
==బాల్యం==
రాజాజీ డిసెంబరు 10, 1878 న సాంప్రదాయ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబీకులైన చక్రవర్తి అయ్యంగార్, సింగారమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన స్వస్థలం తమిళనాడు, సేలం జిల్లాలోని తోరపల్లి అనే గ్రామము. ఇది పారిశ్రామిక పట్టణమైన హోసూరుకు దగ్గర్లో ఉంటుంది. ఆయన తండ్రి చక్రవర్తి అయ్యంగార్ తోరపల్లి గ్రామానికి మునసబు. ఆయన పాఠశాల విద్య హోసూరు లోనూ, కళాశాల విద్య [[చెన్నై]] మరియు [[బెంగళూరు]] లోనూ జరిగింది. 1897 లో బెంగళూరు లోని సెంట్రల్ కళాశాల నుంచి ఆర్ట్స్ లో పట్టభద్రుడయ్యాడు. 1899 లో మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాల నుంచి న్యాయ శాస్త్రాన్ని అభ్యసించాడు. 1900 లో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించాడు.సాలెం లో ఉండగానే ఆయన సామాజిక, రాజకీయ స్థితిగతులపై ఆసక్తి చూపేవాడు.
 
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/501308" నుండి వెలికితీశారు