చక్రవర్తి రాజగోపాలాచారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
==భారత స్వాతంత్ర్యోదమం==
రాజకీయాల్లో రాజాజీ ప్రస్థానం సాలెం పట్టణానికి ప్రతినిథిగా ఎన్నికవడంతో ప్రారంభమైంది. 1900 మొదటి దశాబ్దంలో ప్రముఖ జాతీయవాది బాలగంగాధర్ తిలక్ పట్ల ఆకర్షితుడయ్యాడు. 1917 లో సాలెం పట్టణ మునిసిపాలిటీ కి చైర్మన్ గా ఎన్నికయ్యాడు<ref name="pillarsp88">{{cite book|title=Pillars of Modern India, 1757-1947|first=Syed Jafar|last=Mahmud|page=88|year=1994|publisher=APH Publishing|isbn=8170245869, ISBN 9788170245865}}</ref>. సాలెం ప్రభుత్వంలో మొట్టమొదటి దళిత ప్రతినిథి కూడా ఆయన చొరవతోనే ఎన్నికయ్యాడు. తరువాత ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం ప్రారంభించాడు. 1908 లో వరదరాజులు నాయుడు అనే స్వాతంత్ర్య పోరాట యోధుడికి తరపున ప్రభుత్వ ధిక్కారం కేసుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించాడు. 1919లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నాడు. ప్రముఖ జాతీయవాది వీఓ చిదంబరం పిళ్ళై ఈయనకు మంచి స్నేహితుడు. [[అనీబిసెంట్]] కూడా రాజాజీని అభిమానించేది.
 
1919లో మహాత్మా గాంధీ స్వాతంత్ర్యోద్యమంలోకి ప్రవేశించినపుడు రాజాజీ కూడా ఆయన్ను అనుసరించాడు. [[సహాయ నిరాకణోద్యమం]]లో పాల్గొన్నాడు. న్యాయవాదిగా ప్రాక్టీసు కూడా మానేశాడు. 1921లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కి ఎన్నికయ్యాడు. ఆ పార్టీకి జనరల్ సెక్రెటరీ గా కూడా వ్యవహరించాడు.<ref name="pillarsp88" />
 
1923 లో కాంగ్రెస్ విడిపోయినపుడు రాజాజీ సివిల్ డిసొబీడియెన్స్ కమిటీలో సభ్యుడు. గాంధీజీ అంటఋఆని తనాన్ని రూపమాపడానికి చేపట్టిన వైకోం సత్యాగ్రహం ఆయనకు కుడిభుజంగా ఉన్నాడు. ఆసమయంలో పెరియార్ ఈవీ రామస్వామి రాజాజీ నాయకత్వంలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. వీరిద్దరూ తరువాతి కాలంలో రాజకీయంగా వేర్వేరు పార్టీలకు చెందినా మంచి స్నేహితులుగా ఉన్నారు.
 
1930 లో తమిళనాడు కాంగ్రెస్ లో రాజాజీ ప్రముఖ నాయకుడయ్యాడు. అదే సమయంలో మహాత్మా గాంధీ దండి యాత్ర నిర్వహించినపుడు రాజాజీ నాగపట్టణం దగ్గర్లోని వేదారణ్యం అనే ప్రాంతంలో ఉప్పు పన్నును వ్యతిరేకించి జైలుకి వెళ్ళాడు. తరువాత రాజాజీ తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1935 లో భారత ప్రభుత్వం అమల్లోకి వచ్చినపుడు భారత జాతీయ కాంగ్రెస్ ను సాధారణ ఎన్నికల్లో పాల్గొనేలా చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.
 
==మూలాలు==