గోడకుర్చీ: కూర్పుల మధ్య తేడాలు

Updates from Prof. Murthy
పంక్తి 7:
[[Image:godakurchi.jpg|400px|center|గోడకుర్చీ చేస్తున్న ఒక బాలుడి బొమ్మ]]

==చరిత్ర==
ఏమి యోగాసనమో ఏమిటో, ఇదో పెద్ద శిక్షగా వేయించేవారు చిన్నప్పుడు
తెలుగువాళ్ళు ప్రాచీనకాలంనుంచీ గోడకుర్చీ చేస్తున్నారు. కానీ, మిగతాప్రాంతం ప్రజలకు గోడకుర్చీని గురించి ఇంతవరకూ తెలియదు. ఇంగ్లీషువాళ్ళు, స్ఖూలులో అసభ్యంగా ప్రవర్తించిన పిల్లల్ని బెంచిమీద నిలబడమని సిక్ష వేస్తారు. ఇంగ్లీషువాళ్ళహయాంలో ఇన్నిసంవత్సరాలు ఉండడంవల్ల మన పంతుళ్ళుకూడా ఈ పద్ధతినే ఇప్పుడు అవలంబిస్తున్నారు. కానీ దీనిముందు తెలుగుపంతుళ్ళు అసభ్యప్రవర్తన చేశిన విద్యార్ధులను క్రమశిక్షణ చెయ్యడానికి వాళ్ళచేత గోడకుర్చీ వేయించేవారు.

==ఈ వ్యాయామాలవల్ల ఫలితం ఏమిటీ?==
రక్తనాళాల్లో ప్లాకు పేరుకుంటే వాటిలో రక్తప్రసారం అడ్డగించబడుతుంది. హై బ్లడ్‌ప్రెజర్‌కీ, గుండెజబ్బుకీ ఇదే ముఖ్య కారణం. ప్రతిరోజూ షుమారు ఒక గంటసేపు ఈ వ్యాయామాలు చేశ్తే శరీరంలో రక్తప్రసరణ బాగా పెరిగి రక్తనాళాల్లో ప్లాకు పేరుకోవడానికి అవకాశం తగ్గుతుంది. ముసలితనంలో చాలామందికి సెనిలిటీ, ఆల్‌జైమర్సు వ్యాధి వచ్చి, వాళ్ళు క్రమేపీ జ్ఞాపకశక్తిని పోల్గోటం జరుగుతోంది. ఇవి పేషంట్లకూ, వారికుటుంబాలఖూ ఎన్నో ఇక్కట్లు కల్గించే ఘోరమైన వ్యాధులు. ఈ వ్యాధులకు ముఖ్యకారణం మెదడులోని రక్తనాళాల్లో ప్లాకు పేరుకోవడమే అని ఈ మధ్య తెలిసింది. దొర్లింగు, వణుకుల్లో తల తిప్పడంవల్ల, మెడ, మెదడుల్లో రక్తప్రసారం బాగా పెరిగి, మెదడులోని రక్తనాళాల్లో ప్లాకు పేరుకోవడానికి అవకాశం తగ్గుతుంది. కొంతమంది దిప్రెషన్‌ తో బాధ పడుతుంటారు. మెదడుని శరీరంక్రిందిభాగంతో కలిపే వేగాస్‌ నర్వుని (ఇది మెడ ఎడమభాగం గుండా దిగుతుంది) ఉత్తేజ పరిస్తే వారి పరిస్థితి మెరుగవుతుందని ఈ మధ్య కనిపెట్టారు. దొర్లిగు, వణుకుల్లో తలతిప్పడం మూలాన వేగాస్‌ నర్వుకి ఈ ఉత్తేజం రోజూ కల్గి దిప్రెషన్‌ రాకుండా చేస్తుంది. ఈ మధ్య ఇండియన్స్‌లో డయాబెటీసు చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ఈ వ్యాధికి తెలుగులో చాలా పేర్లు ఉన్నాయి: ప్రమేహం, అతిమూత్రం, మధు మూత్రం, మధుమేహం, అని. కానీ ఇప్పుడు డయాబెటీసు అనే పదం బాగా వాడుకలోకి వచ్చేశింది. ప్రతిరోజూ శరీరంలో అవయవాలనన్నిటినీ బలంగా కదిలించే వ్యాయామాలు చేస్తే డయాబెటీసు వచ్చే అవకాశం బాగా తగ్గుతుందని పరిశోధనలవల్ల తెలిసింది. ప్రతిరోజూ గోడకుర్చీ వెయ్యడంవల్ల మోకాటికీ, మోకాటిచిప్పకూ, కాళ్ళలోని, తుంటిలోని ఎముకలకూ; బలం చేకూరి, ఎముకలబలహీనతకు చెందిన వ్యాధులు రాకుండా చేస్తుంది. సరిపోయినంత కాల్షియం తమ భోజనంలో తీసుకుంటూ, రోజూ గోడకుర్చీ వేశేవారి కాలి ఎముకలకు ఆస్టియోపొరోసిస్‌ రాదు.

==నా చిన్నప్పటి అనుభవం==
మా పెద్దతాతయ్య గోడకుర్చీమీద ఒక మంచి సామెత చెప్పేవాడు. అది చెప్తాను. నా చిన్నప్పటికే పెద్దతాతయ్య ముసలివాడు. కానీ ప్రతిరోజూ కనీసం 5 నిమిషాలపాటు గోడకుర్చీ వేశేవాడు. "మీరూ వెయ్యండిరా మీ కాళ్ళు బలపడ్తాయీ" అని చెప్పేవాడు కానీ ఎవ్వరూ వీనేవాళ్ళం కాదు. దానికి ఆయన వాడే గోడను అందరూ "తాతయ్య గోడా" అని పిల్చేవారు. ఇండియాలో, రాత్రి పడుకున్న మంచాన్ని పగపూట ముడిచి గోడకు ఆన్చి ఉంచుతారుగదా. తాతయ్య గోడకు మాత్రం ముడిచిన మంచాలు ఆన్చడం నిషేధమ మా కుటుంబంలో. నేను ఎప్పుడైనా మర్చిపోయి నా మంచాన్ని ఆ గోడకు ఆనిస్తే మా అమ్మ "తాతయ్య గోడకు ఎందుకాన్చావురా నీ మంచాన్ని" అంటూ కోప్పడేది. ఒకసారి మాకుటుంబమంతా ఏదో పుణ్యక్షేత్రదర్శనానికి వెళ్ళాం. ఆ రోజల్లా చాలా నడవాల్సి వచ్చింది, కొండలు, మెట్లు చాలా ఎక్కాల్సివచ్చింది. సాయంత్రం బసకు చేరుకున్నవెంటనే చాలామంది "నాకాళ్ళు నొప్పిపెడ్తున్నాయి మొర్రో" అంటూ మంచాలమీద కూలారు. కానీ తాతయ్య మాత్రం కాయగూరలు కడిగి తరగడం మొదలుపెట్టాడు. "నీ కాళ్ళు నొప్పిపెట్టడం లేదా తాతయ్యా" అని అడిగితే "గోడకుర్చీతో గట్టిపడ్డ కాళ్ళు ఎంతదూరమైనా వెళ్ళగలవురా" అన్నాడు!.

===స్వానుభవం=== 20 ఏళ్ళ క్రితం నా రక్తంలో కోలెస్టెరాల్‌ లెవలు పెరిగి, అది తగ్గించడానికి మందులు (లిప్పిటోర్‌ లాంటివి) తీసుకోవల్సిన అవసరం కల్గింది. ఈ మందులు కోలెస్టెరాల్‌ని తగ్గిస్తాయికానీ, వాటివల్ల వచ్చే సైడ్‌ఎఫేక్టులు చాలా ఉన్నాయి. నాకు ముఖ్యంగా కాళ్ళు విపరీతంగా నొప్పివెయ్యడం మొదలుపెట్టాయి. డాక్టరు ``ఫర్వాలేదు, కొన్నాళ్ళల్లో కాళ్ళనొప్పి తగ్గుతుంది, ఓపిగ్గా ఉండూ' అనేవాడు. ఈ మందులు రెండు సంవత్సరాలు వాడాక నాకు విసుగెత్తి, డాక్టౠ హెచ్చరిస్తున్నా సరే మానేశి, నా ఆరోగ్యాన్ని స్వప్రయత్నంతో బాగుపరచుకోవడానికి నిశ్చయించాను. పాలలో కోలెస్టెరాల్‌ ఉంటుంది. అందుకని పాలు, పెరుగులతో చేశే వంటకాలన్నీ తినడం మానేశి వీగన్‌ అయ్యాను. వీడియోలో చూపించిన వ్యాయామాలు మూడూ ప్రతిరోజూ గంటసేపు ఖచ్చితంగా చెయ్యడం మొదలుబెట్టాను. నూనె ఎక్కువగా ఉండే వేపుళ్ళు; పూరీ, గారె, పకోడీ, కారప్పూస లాంటి వంటకాలు తినడం బాగా తగ్గించాను. వీటివల్ల ఏ మందూ లేకుండానే నా కోలెస్టెరాల్‌ లెవలు బాగా తగ్గిపోయింది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా, అందుకనే, అందరికీ నేను:

పిల్లలూ, యువతులూ, యువకులూ, పెద్దలూ

ఈ వ్యాయామాలూ

లేక నచ్చిన ఇతర కసరత్తులూ

రోజూ చేస్తే మీ జీవితం మెరుగూ

మీచురుకుదనమూ

ఆలోచనాశక్తీ పెరుగూ

మీకు డయాబెటీసు దూరమగూ ఊ ఊ ఊ ...

అంటూ పాడుకుంటూ పాటించమని చెప్తాను. త్వరలొనే "మహాత్మా మీ సలహా అద్భుతంగా పనిచేశింది. పోబోతున్న నా ఆరోగ్యాన్ని నిలబెట్టుకోగల్గాను. నన్ను ధన్యుణ్ణి చేశారూ" అంటూ నాకు మెసేజి పంపిస్తారు చూసుకోండి!

==రిఫరెన్సులు==
[1] కట్టా గోపాలకృష్ణ మూర్తి, ``కొన్నితెలుగుదనాలతో నా అనుభవాలూ', available at websites http://telugudiaspora.com/telugu_publications_article14.htm or http://www.tlca.com/adults/telugudanam.html

కట్టా గోపాలకృష్ణ మూర్తి Department of Industrial and Operations Engineering
University of Michigan, Ann Arbor. e-mail: murty@umich.edu ; Webpage: http://www-personal.engin.umich.edu/~murty/
"https://te.wikipedia.org/wiki/గోడకుర్చీ" నుండి వెలికితీశారు