పెన్సిల్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: sh:Olovka
పంక్తి 4:
పెన్సిల్ ని కనిపెట్టింది జోసెఫ్ డిక్సన్. <ref>http://www.telugudanam.co.in/vijnaanam/meeku_telusaa/pencil_puttindilaa.htm</ref>ఆయన ఇంగ్లాండ్‌లో పుట్టాడు. చాలా పేదవాడు. ఇల్లు గడవటానిక ఒకచిన్న దుకాణంలో పనికి చేరాడు. యజమాని చెప్పింది గుర్తుపెట్టుకోవటానికి ఏం చెయ్యాలో తెలియక ఒకరోజు బయటపడి ఉన్న ఓ నల్లరాయితో గోడమీద రాశాడు. అంతే! ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద ఆ నల్లరాయితో రాసేవాడు. ఆ రాయే [[గ్రాఫైట్]]. డిక్సన్‌కు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఆ రాయిని పొడిచేసి కాస్త ముద్దగా ఉండటానికి ఆముదంలాంటి పదార్ధాన్ని కలిపి, దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాశాడు. బాగానే ఉంది. కానీ కాస్త బరువుగా ఉండి రాయడానికి అంతగా వీలుకాలేదు. చేతులు నల్లగా అయ్యేవి. చాలా ప్రయోగాలు చేశాడు. కొన్ని రోజులకు ఒక ఉపాయం తట్టింది.
 
ఒక సన్నని కొయ్య ముక్కని తీసుకుని దానికి ఒక చిన్న రంద్రాన్ని వేసి ముద్దగా ఉన్న గ్రాఫైట్‌ను నింపి బాగా ఎండిన తర్వాత రాశాడు. అద్భుతం! పెన్సిల్ తయారయింది. సన్నగా రాయడం, చేతులకు నలుపు అంటకపోవడం, వేగంగా రాయడం లాంటిది జరిగింది. మొదట్లో గుండ్రని పెన్సిళ్లు వచ్చేవి. తర్వాత మరెన్నో మార్పులతో నేడు పెన్సిల్ రకరకాలుగా ఉపయోగపడుతోంది. పెన్సిల్‌ని గ్రాఫైట్‌తో చేస్తారు. గ్రాఫైట్ అనేది ఒక కర్బన సమ్మేళనం. వజ్రం కూడా కర్బన పదార్థమే. కానీ వజ్రానికి ఉన్న కాఠిన్యం గ్రాఫైట్‌కు లేదు. పెన్సిల్ పంచభుజి,చెక్క అష్టభుజిగుండ్రంగా రూపాల్లోనేఉండవచ్చు ఉంటుంది.కానీ ఎందుకంటే"సాధారణంగా" పంచభుజి, ఒకఅష్టభుజి కొయ్యరూపాల్లోనే ముక్కతోఉంటే గుండ్రని ఆకారంలో ఉన్న పెన్సిల్ కంటే, పంచభుజి, అష్టభుజి రూపంలోచెక్కతో ఎక్కువ పెన్సిళ్లను తయారుచేయవచ్చు.
 
==భారత్ లో పెన్సిల్ కంపెనీలు==
"https://te.wikipedia.org/wiki/పెన్సిల్" నుండి వెలికితీశారు