సౌర శక్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''సౌర శక్తి''' ([[ఇంగ్లీషు]]: solar power, సొలార్ పవర్) సూర్యిడి కిరణాల నుండి వెలువడే శక్తి.
==సోలార్‌ ఉత్పత్తులు ==
 
సోలార్‌ వస్తువుల ధరలు అధికంగా ఉండటంతో చాలామంది ఈ ఉత్పత్తుల వినియోగం పట్ల మొగ్గు చూపట్లేదు.వివిధ రకాల సోలార్‌ ఉత్పత్తులు వచ్చాయి. స్ట్రీట్‌లైట్స్‌, హోం లైటింగ్‌ సిస్టమ్స్‌, వాటర్‌ హీటర్లు, ఇన్వర్టర్లు, ల్యాంపులు లభిస్తున్నాయి.
సోలార్‌ టోపీ ముందుభాగంలో చిన్నపాటి ఫ్యాన్‌ అమర్చి ఉంటుంది. ఎండ వేడికి ఈ ఫ్యాను తిరుగుతూ చల్లటి గాలిని అందిస్తుంది.అపార్ట్‌మెంట్లపై సోలార్‌ ఎనర్జీ ప్లాంటు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 30 శాతం రాయితీ ఇస్తోంది. ఇందుకు సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్‌)కు దరఖాస్తు చేసుకోవాలి. దీని ఆధ్వర్యంలోని ఏజెన్సీల వారు అపార్ట్‌మెంటును పరిశీలించి, ఎన్ని వాట్స్‌ విద్యుత్తు అవసరమన్నది అంచనా వేస్తారు. వారే ప్లాంటును ఏర్పాటు చేస్తారు. ఒక కిలోవాట్‌ సోలార్‌ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది.సోలార్‌ ఎమర్జెన్సీ లైటుని ఎండలో 6 గంటలు ఉంచితే మూడు గంటల పాటు నిరంతరాయంగా బల్బు వెలుగుతుంది. రాత్రి వేళ అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోతే వీటిని ల్యాంప్‌లుగా ఉపయోగించుకోవచ్చు.సోలార్‌ హోం లైటింగ్‌ సిస్టంలో నాలుగు బల్బులుంటాయి. వీటికి ఉండే సోలార్‌ ప్యానెల్‌ని డాబామీద నీడలేని ప్రాంతంలో ఉంచాలి. ఇది వేడికి ఛార్జి అవుతుంది. ఇంట్లో నాలుగు గదులుంటే వాటిలో ఒక్కొక్క దానిలో ఒక్కో బల్బును వెలిగించుకోవచ్చు.ఇంటి ఆవరణలో సోలార్‌ వీధి దీపాలను ఒక పోల్‌కి అమర్చి దానిపై సోలార్‌ ప్యానెల్‌ ఉంటుంది. ఎండకు ఛార్జింగ్‌ అవుతుంది. రాత్రి పూట వెలుగులు విరజిమ్ముతుంది.
సోలార్‌ వాటర్‌ హీటర్‌ ని శాశ్వతంగా ఇంటి డాబాల మీద ఏర్పాటు చేసుకోవాలి. పగలు ఎండకు నీళ్లు వేడెక్కుతాయి. అలా వేడెక్కిన నీరు 24 గంటలపాటు 60 డిగ్రీల ఉష్ణోగ్రతలో వెచ్చగా ఉంటాయి. మనం ఎప్పుడైనా వీటిని ఉపయోగించుకోవచ్చు. నీరు నిలువ ఉండే ట్యాంకు పైపులైనుకు పఫ్‌ ఏర్పాటు ఉంటుంది. అది నీరు చల్లబడకుండా కాపాడుతుంది. వీటిని ఆపార్ట్‌మెంట్లకు అమర్చుకొంటే విద్యుత్తు వినియోగాన్ని భారీగా ఆదా చేయవచ్చు. సోలార్ పవర్‌ ఇన్వర్టర్ల ద్వారా ఇంట్లో బల్బులు, ఫ్యాన్లు, టీవీ పనిచేస్తాయి. మూడు, నాలుగు గంటల పాటు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ సోలార్‌ ప్యానెళ్లు ఎండకు ఛార్జి అయి, విద్యుత్‌ సరఫరా లేని సమయంలో పనిచేస్తాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/సౌర_శక్తి" నుండి వెలికితీశారు