చూయింగ్ గమ్: కూర్పుల మధ్య తేడాలు

మొలక
 
విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
[[చూయింగ్ గమ్]] కృత్రిమ రబ్బర్ తో తయారు చేసే ఒక తినే పదార్థం.
 
చూయింగ్‌ గమ్‌ చరిత్ర 1866 సంవత్సరంతో ముడిపడి వుంది. [[మెక్సికో]] దేశపు సైనిక నియంత సాంటా అన్నాతో జతపడి వుంది. 1866నాటి తన దేశపు అంతర్యుద్ధ్యం సందర్భంగా సాంటా అన్నా అజ్ఞాతంలోకి వెళుతూ దళసరిగా తెల్లగా వున్న జిగురు ముక్కను తన వెంట పట్టుకునిపోయాడు. మెక్సికోలోని ఒక తరహా చెట్టు బెరడు నుండి స్రవించే ఈ [[జిగురు]]ను ప్రతికూల పరిస్థితుల్లో చప్పరించడం అక్కడి వారికి ఆనవాయితీగా వస్తోంది. సాంటా న్యూయార్క్‌లోని స్టేటన్‌ దీవిలో తలదాచుకున్నాడు.
 
కొన్ని నెలల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చాడు సాంటా. తను వుపయోగించగా మిగిలిన జిగురు ముక్కను తన టేబుల్‌ సొరుగులో వదిలేసాడు. అదే దీవిలో వున్న థామస్‌ ఆడంస్‌ అనే శాస్త్రవేత్త ఆ జిగురు ముక్కను చేజిక్కించుకున్నాడు. సాంటా ఆ జిగురు ముక్కను నములుతూ వుండేవాడని థామస్‌ తెలుసుకున్నాడు. సాగుతున్న పదార్థంలో ఏం రుచి వుందో ఆయనకు అర్థం కాలేదు. జిగురును సేకరించి ఒకరకమైన రబ్బరును రూపొందించాలనుకున్నాడు కానీ అది తయారవ్వలేదు. కృత్రిమ దంతాలు అమర్చడానికి ఆ జిగురు ఉపయోగపడుతుందేమోనని ప్రయోగం చేశాడు. కానీ అది సాథ్యం కాలేదు.
 
చివరకు థామస్‌ ఆ జిగురును ఉడకబెట్టి చిన్న చిన్న పుల్లలు తీసుకుని వాటి చివరన ఈ ఉడికించిన జిగురును అతికించి [[పంచదార]] బిళ్లలు అమ్మే దుకాణాల్లో అమ్మాలని ప్రయత్నించాడు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో విపరీతమైన ప్రేరణ పొందడు. దానితో గమ్‌స్టిక్స్‌ వ్యాపారం మొదలైంది. వేలాదిగా వీటిని తయారుచేసే యంత్రాన్ని కనిపెట్టి, తన ఉత్పత్తికి చూయింగ్‌ గమ్‌ అని పేరు పెట్టాడు.
 
ఇంకా ఎంతో మంది వర్తకులు ఈ గమ్‌ స్టిక్స్‌కోసం వ్యాపారం ప్రారంభించాడు. రకరకాల రంగులూ, సువాసనలూ కల గమ్‌స్టిక్స్‌ తయారవడంతో పాటు వాటికి ఆకర్షణ్ణణీయమైన కాగితాలు చుట్టుడంతో చూయింగ్‌ గమ్‌ స్వరూపం మారిపోయింది. మార్కెట్లో విపరీతమైన పోటీ ఏర్పడటంతో ఛార్లెస్‌ ఫ్లింట్‌ నాయకత్వంలో ఆరు కంపెనీలు కలిసి చూయింగ్‌ గమ్‌ ట్రస్టుని ఏర్పాటుచేసుకున్నారు. కానీ విలియం రిగ్‌లీ మాత్రం ఈ ట్రస్టులో చేరడానికి సమ్మతించలేదు. ఆయన తన చూయింగ్‌ గమ్స్‌ను రిగ్‌లీ చూయింగ్‌ గమ్స్‌ పేరిట విక్రయించేవాడు. ఆయన దీని కోసం ప్రకటనలు కూడా ఇచ్చేవాడు.
 
[[en:Chewing gum]]
"https://te.wikipedia.org/wiki/చూయింగ్_గమ్" నుండి వెలికితీశారు