చెరువు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
* [[మురుగు నీటి చెరువులు]] మురుగు నీరు చేరి నిలువపడగా ఏర్పాటైన చెరువులు.
== [[కుంటలు]]==
* [[కుంటలు]] కొంత నీరు చెరిన వాటినేవయినా కుంటలుగా వ్యవహరిస్తారు
చిన్న పాటి చెరువులు.చిక్కిశల్యమైన చెరువులు కుంటల చరిత్ర తెలుసుకునేందుకు మండలాల వారీగా సర్వే జరుపు తున్నారు.2007లో 100 ఎకరాల ఆయకట్టులోపు ఉన్న చెరువులను పంచాయతీరాజ్‌శాఖ నుంచి నీటిపారుదలశాఖకు బదిలీ చేశారు.దురాక్రమణ, తూములు పాడవడం, పారని చప్టాలు, ఫీడర్‌ ఛానెళ్లు లేకపోవడం, సాగునీరు అందే సమయంలో గట్లకు గండిపడడం ఇలా ఎన్నో అవస్థలున్నాయి. చెరువు ఆయకట్టు ఎంత ? ప్రస్తుతం ఏ దశలో ఉంది ? ఎంత ఆక్రమణలకు గురైంది తదితర వివరాలు సేకరిస్తారు. తూముల వివరాలు, వాటి పరిస్థితిని గుర్తిస్తున్నారు. ఫీడర్‌ ఛానెళ్ల పరిస్థితి అంచనా వేస్తారు. చెరువు గట్ల పరిస్థితి, చప్టాలు నిర్మించారా ? వాటి స్థితిగతులు ఏమిటి అన్న అంశాలు పరిగణలోనికి తీసుకుంటారు. వీటితో పాటు ఆయా చెరువులు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే భౌగోళికంగా అక్కడి పరిస్థితులను బట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది పరిశీలిస్తారు. ఇలా 44 అంశాలతో సమాచారం మొత్తం క్రోడీకరించి సమగ్ర రికార్డులు తయారుచేస్తారు.100 ఎకరాలు దాటిన ఆయకట్టు చెరువుల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులు కేటాయిస్తోంది.
* [[కోనేరు]], [[దేవాలయం|దేవాలయాల]]లో దేవుని భక్తులకోసం ఏర్పాటుచేసిన చెరువు.
 
చెరువుల నుంచి సాధారణంగా నీటిని బయటకు రాబట్టడానికి తూములు అనబడే ద్వారాలు ఉంటాయి. వీటి ద్వారా నీటిని కొద్ది కొద్ది పరిమాణాల్లో నీటిని పంటలకు వదులుతూ ఉంటారు. వేసవి సమయంలో మరీ నీరు అడుగంటినపుడు మోటార్లు, ఇంజన్ల ద్వారా కూడా నీటిని బయటకు తోడుతారు. వర్షాకాలంలో చెరువులు పూర్తిగా నిండినపుడు పెద్ద మొత్తంలో నీటిని బయటకు విడిచిపెట్టడానికి కలుజులు కూడా ఉంటాయి. ఇవి నీళ్ళు నిండిన చెరువులు తెగిపోకుండా కాపాడుతాయి.
 
"https://te.wikipedia.org/wiki/చెరువు" నుండి వెలికితీశారు