ఆస్కార్ షిండ్లర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
కొన్నేళ్ళ తర్వాత జర్మనీ వచ్చి చిన్నా చితకా వ్యాపారాలెన్నో చేశాడు.. కానీ ఏదీ కలిసి రాలేదు. ఒకప్పుడు లక్షాధికారిగా విలాసజీవితం గడిపిన షిండ్లర్ చివరి రోజుల్లో దారిద్య్రంలో బతుకు వెళ్ళదీశాడు. అతని దగ్గర ప్రాణాలు నిలుపుకున్న యూదులంతా అనేక దేశాల్లో స్థిరపడ్డారు. [[ఇజ్రాయెల్]] ఉన్నవారు ఏటా అతడి పుట్టిన రోజు నాటికి తమ దేశానికి పిలిచి సత్కరించి పంపేవాళ్ళు. ఆయన చనిపోయాక జెరూసలెం పురవీధుల్లో ఘనంగా ఊరేగించి ఆ గడ్డపైనే సమాధి చేసి తమ కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం షిండ్లర్ ను ''రైటియస్ అమాంగ్ ది నేషన్స్'' పురస్కారంతో గౌరవించింది.
 
షిండ్లర్‌ చనిపోయాక ఆయన సూట్‌కేస్‌లో లభ్యమైన యూదుల జాబితా(షిండ్లర్స్‌ లిస్ట్‌)ను ఇజ్రాయెల్‌లోని ఒక మ్యూజియంలో భద్రపరిచారు. అప్పట్లో స్టెర్న్‌ సాయంతో దాదాపు పది జాబితాలను రూపొందించాడు షిండ్లర్‌. వాటిలో నాలుగు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఇజ్రాయెల్‌, అమెరికా, ఆస్ట్రేలియా మ్యూజియాలలో మూడు ప్రతులు ఉండగా ఒక్కటి మాత్రం స్టెర్న్‌ వద్ద ఉండిపోయింది. యాభైఐదేళ్లపాటు అది స్టెర్న్‌, అతని వారసుల దగ్గరే ఉంది. అనంతరం వారు ఆ లిస్ట్‌ను న్యూయార్క్‌కు చెందిన ఒక వ్యాపారికి అమ్మేశారు.
 
ఇప్పటికీ ఇజ్రాయెల్ లో పుట్టే పిల్లల్లో ఎక్కువమంది పేరు మగ పిల్లాడైతే షిండ్లర్, ఆడపిల్లయితే ఎమిలీ. ఇలా వారు ఆ దంపతుల పట్ల అభిమానాన్ని చాటుకుంటున్నారు.
 
==ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/ఆస్కార్_షిండ్లర్" నుండి వెలికితీశారు