పంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ): కూర్పుల మధ్య తేడాలు

చి లింకు చేర్చు
పంక్తి 1:
'''పంచాయితీ''' [[భారతదేశం]]లో గ్రామం స్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీనమైన పాలనా వ్యవస్థ. ఇంచుమించు 30 లక్షల మంది ప్రజా ప్రతినిధులతో నడుస్తున్న '''[[పంచాయితీ రాజ్]] వ్యవస్థ''' ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన [[గ్రామాలు|గ్రామాలకు]] ఇది వెన్నెముకగా పనిచేస్తుంది. దేశ వ్యాప్తంగా 537 జిల్లా పంచాయితీలు, 6,097 మండల పంచాయితీలు మరియు 2,34,676 [[గ్రామ పంచాయితీలుపంచాయితీ]]లు పనిచేస్తున్నాయి. [[నేపాల్]] లో కూడా ఇలాంటి పంచాయితీ వ్యవస్థ నడుస్తుంది.
==పంచాయితీల చరిత్ర==
ప్రాచీనకాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన [[వృత్తి|వృత్తుల]] ప్రతినిధులతో పనిచేశేవి. అయితే ఇవి ఎక్కువగా అణచివేతకు గురయ్యేవి. బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ [[రిప్పన్]] ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919 మరియు 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి.