వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 12: కూర్పుల మధ్య తేడాలు

వైజా సత్యగారికి శివ సమాధానం
చి (→‎మూలాల గురించి: కొత్త విభాగం)
(వైజా సత్యగారికి శివ సమాధానం)
::ఇద్దరు సభ్యులకూ మనఃపూర్వకంగా విన్నవించడమేమంటే, ఇద్దరూ ప్రతిభావంతులే, ఇద్దరూ చొరవతీసుకుని, తెవికీలో చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి. మాటామంతీ వుంటే బాగుంటుందని, మాటామాటా వుంటే అభివృద్ధి కుంటుపడుతుందని తెలుపుతున్నాను. జరిగినదాన్ని విశాలహృదయంతో మరచిపోయి భవిష్యత్తు కార్యక్రమాలలో పాల్గొంటారనీ ఆశిస్తున్నాను. [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] 10:09, 8 జూన్ 2009 (UTC)
:ఈ విషయంలో ఒకరి వ్యాఖ్యల వల్ల మరొకరి అహం దెబ్బతిన్నదని నాకు స్పష్టంగా అర్థమవుతోంది. నేను మీకన్న వయసులో చిన్న వాణ్ణే. అయినా చొరవతో అంటూన్నాను. రెండు చేతులు కలిస్తేనే శబ్దం. దయచేసి మీరిరువురూ (కనీసం ఒకరైనా) తమ చేయిని వెనక్కి తీసుకోండి. ఒకసారి ఇప్పటి దాకా మీ మనసులో ఆలోచలని పక్కనబెట్టి విశాల థృక్పథంతో ఆలోచించండి. పైన అందరూ చెప్పనదే నేనూ పునరుద్ఘాటిస్తున్నాను. ఇది చాలా చిన్న విషయం. శివగారిని ఆ విషయాన్ని అంతటితో మరిచిపొమ్మని అభ్యర్థిస్తున్నాను. వ్యక్తిగతంగా నేను కూడా ఇలాంటి సంఘటన(లు) ఎదుర్కొన్నాను. తెవికీని అభివృద్ధి చేయాలన్న మహోన్నత లక్ష్యం ముందు ఇవి చాలా చిన్న చిన్న విషయాలని మరిచిపోవద్దు. జరిగింది ఒక పీడకలగా మరిచిపోమని, యధావిధిగా తమ విధులు నిర్వర్తించమని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. --[[సభ్యుడు:రవిచంద్ర|<font style="background:#b0e0e6;color:#8b0000;"><b> రవిచంద్ర</b></font>]][[సభ్యులపై చర్చ:రవిచంద్ర|<font style="background:#00beaf;color:#FDD017;"><b>(చర్చ)</b></font>]] 10:53, 8 జూన్ 2009 (UTC)
 
 
=వైజా సత్యగారికి శివ సమాధానం=
సత్యా గారూ, ఇక్కడ జరిగిన ఒక వ్యక్తి చేసిన దురదృష్ట వ్యాఖ్యలవల్ల వికీలో వ్రాయటం మానేశాను. ఇక వ్రాయటమనేది జరుగక పోవఛ్ఛు. చాలా కాలం తరువాత ఇక్కడకు వచ్చాను మీ వ్యాఖ్య ఛూసి ఆశ్ఛర్య పొయాను. ఒక పక్క డిస్ప్యూట్ రిజల్యూషన్ కు నేను విషయాన్ని విన్నవించినప్పుడు ఘనత వహించిన ఆయన గారు చేసిన వ్యాఖ్య చూడండి:
 
''''"సభ్యులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చేష్టలు చేయడం ఇంకా మానలేవా? చిన్న విషయానికి అనవసరంగా రెచ్చగొట్టి ఇంతవరకు లాగి, సభ్యుల విలువైన సమయాన్ని వృధాచేస్తున్న నీ అసలు ఉద్దేశ్యం ఏమిటి? తెవికీ పాలసీలు, నియమాలు, సంప్రదాయాలు గురించి తెలియకుంటే తెలుసుకోవాలి, అంతేకాని తెలిపిన సభ్యుల వ్యాఖ్యలకు భిన్నంగా వ్యవహరించడం ఏమిటి? "సామాన్య సభ్యుల దాష్టీకం, పిడివాదం" అంటూ పెద్ద పెద్ద పదాలను ఉపయోగిస్తున్నావు, తెవికీలో కొత్త సభ్యులకు కూడా ఎన్నో విషయాలు చెప్పాను, వారు సంతోషంగా నా వ్యాఖ్యలను స్వీకరించారే కాని నీలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయలేరు. నాచే "నువ్వు" అని అనిపించుకున్న సభ్యులలో నీవు రెండో వాడివి. సాధారణంగా నేనెవరికీ వ్యక్తిగతంగా విమర్శించను గౌరవంగానే చూస్తాను. ఇది తెవికీలో అందరికీ తెలుసు, నాకు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకొనేది లేదు, ఈ సంగతి కూడా అందరికీ తెలుసు. తెవికీలో ఎవరికి వారు తమకు నచ్చిన పద్దతులు పాటించడం కాదు, అమలులో ఉన్న పద్దతులనే పాటించాల్సి ఉంటుంది. ప్రవేశించిన కొత్త సభ్యులు ఒక్కక్కరు ఒక్కో పద్దతి పాటిస్తే తెవికీ గమ్యం తప్పుతుంది. అనవసరపు ప్రశ్నలు అడిగి చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నావు. అసలు ప్రశ్నలు నా వద్ద ఉన్నాయి. పరిస్థితిని బట్టి మునుముందు వెల్లడిస్తా"''''
 
తాను ఎంతమందిని "నువ్వు" అన్నాడో కూడ లెక్కపెట్టుకునే మనిషిని ఏమనాలి?
 
నేను ఒకపక్క డిస్ప్యూట్ రిజల్యూషన్ కు విషయాన్ని మీకు విన్నవించి ఉండగా అతగాడు పై విధంగా వ్యాఖ్యలు ఛెయ్యటం ఎంతవరకూ వికీ సాంప్రదాయాల ప్రకారమో మీరే నిర్ణయిఛి అతగాడికి తెలియఛెయ్యండి. నాకు మీరు చేసిన డిస్ప్యూట్ రిజల్యూషన్ నచ్చలేదు. నా ఫిర్యాదు అలాగే ఉన్నది. నా ఫిర్యాదును వాపసు తీసుకోను. ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు ఛేస్తూ చురుకుగా వ్యాసాలు వ్రాసే వారిని నిరుత్సాహపరచటమే అతగాడి ధ్యేయంగా కనపడుతున్నది. తాను తప్ప ఇతరులెవరూ వ్రాయకూడదనేమో. ఇన్ని ఎక్కడా కనపడని నియమాలు ఛెప్పే మనిషి తనపేరుకు అన్ని రంగులు ఎందుకో, దానికేమీ నియమాలు లేవా??
 
ఈ వారం బొమ్మ పెట్టటంలో ఉన్న నిబంధనలు ఎక్కడ వ్రాసి ఉన్నాయి, ఇన్నాళ్ళ తరువాత మాత్రమే .బొమ్మను ఈ వారపు బొమ్మగా పెట్టాలి అన్న నియమం ఎక్కడ ఉన్నది చూపించండి. అలాంటి లిఖిత నియమం లేకపోతే నేను పెట్టిన బొమ్మను తీసేయటమే కాకుండా నా చర్చా పేజీకి వచ్చి వ్యాఖ్య చేయటం ఎంతవరకు సమంజసం? నేను ఛురుకుగా లేని సభ్యుణ్ణని ఒకకుంటి సాకు! ఒక అరుదైన బొమ్మను ఈ వారపు బొమ్మగా పెట్టి అందరికీ తెలియఛేద్దామన్న నా ఉత్సాహానికి ప్రతిగా ఇంత అల్లరా పైగా అటువంటి అల్లరి ఒక నిర్వాహకుడి వల్లనా?
 
ఇంతకు ముందు చెప్పినట్టుగా వికీలోకి వచ్చి నేను వ్రాయటం నాకు తెలిసినది చెప్పటానికే కాని ఇతరుల మీద ధాష్టీకం ఛెయ్యటానికి పిడివాదాలు వినిపించటానికి కాదు. అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడటానికి అంతకంటే కాదు. మొదట్లో కాసుబాబుగారి పరిచయం అవ్వటం వల్ల నేను కొన్ని వ్యాసాలు వ్రాయటం జరిగింది. నేను చేసిన కృషికి రెండు పతకాలు కూడ ఇవ్వబడ్డాయి. మొదట్లోనే ఇలాంటి దురుసైన, మర్యాద తెలియని మనిషి ఎదురుపడితే రెండో రోజే తెలుగు వికీకి రావటం మానేసేవాణ్ణి. ఇలాంటి వాడి వల్ల ఇంకెంతమంది ఝడుసుకుని వెళ్ళిపోయారో/వెళ్ళి పోతున్నారో చూసుకోండి.
 
మీరు నా ఫిర్యాదును సవ్యంగా పరిష్కరింఛినా లేకపోయినా నేను వికిలో మళ్ళి వఛ్ఛి వ్రాయటం అనేది జరుగదు. ఈ దురుసైన వ్యక్తి వల్ల ఇక్కడ వ్రాయటం అంటే అసహ్యం వేసిపోయింది. ఇప్పుడు వచ్చి ఈ మాత్రం వ్రాయటమే నాకు బాగాలేదు. శలవు.
 
--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 15:46, 25 ఏప్రిల్ 2010 (UTC)
 
 
 
== కొన్ని విషయాలు - గ్రామాలు, సినిమాలు ==
3,487

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/507268" నుండి వెలికితీశారు