స్పంజిక: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: fr:Porifera
చి యంత్రము కలుపుతున్నది: nv:Táłtłʼááh yilcháazhii; cosmetic changes
పంక్తి 12:
| subdivision = [[Calcareous sponge|Calcarea]]<br />[[Hexactinellid]]a<br />[[Demosponges|Demospongiae]]
}}
'''పొరిఫెరా''' (Porifera) లేదా '''స్పంజికలు''' (Sponges) మొక్కల లాగా కనిపించే స్థానబద్ధ, శాఖలు కలిగిన [[జంతువు]]లు. [[గ్రాంట్]] వీటి జంతు స్వభావాన్ని బట్టి పొరిఫెరా అనగా రంధ్రాలు కలిగిన జీవులు అనే పదాన్ని కల్పించారు. బహుకణజీవులైనప్పటికీ, నిర్దిష్టమైన కణజాలాలు లేకపోవడం వల్ల, ఈ జీవులను [[యూమెటాజోవా]]లో కాకుండా, వేరొక ఉపరాజ్యం [[పేరాజోవా]]లో ఉంచారు.
 
== సాధారణ లక్షణాలు ==
* ఇవి ఎక్కువగా సాగర జీవులు.
* ఇవి వలయ సౌష్ఠవంతో గాని, అసౌష్ఠవంగా గాని ఉంటాయి.
* స్థాన బద్ధ జీవులు. కొన్ని ఏకాంత జీవులు.
* స్పంజికలు బహుకణ జీవులు. కణాలు ప్రత్యేకీకరణ చెందలేదు. కాబట్టి కణపొరలు, నిజకణజాలాలు లేవు. కణజాల, అవయవస్థాయి నిర్మాణం లేదు.
* స్పంజికల శరీరంలో ఉన్న రెండు కణాల పొరలను వేరుచేస్తూ జాంతవ పదార్థం ఉంది.
* శరీర కుడ్యం రంధ్రాలు కలిగి ఉంటుంది. ఇవి శరీర కుహరంలోకి నీరు తీసుకోడానికి ఉపయోగపడతాయి. ఈ రంధ్రాలు సాధారణ లేదా క్లిష్టమైన నాళికలతో కలిసి ఒక అద్వితీయమైన వ్యవస్థగా ఏర్పడింది. దీనిని కుల్యా వ్యవస్థ అంటారు. దీని ద్వారాఅ నీరు ప్రవహిస్తుంది. కొయనోసైట్ కణాలు నీటిని శరీరంలోకి మళ్ళించడానికి దోహదం చేస్తాయి. నీటి ప్రవాహంతో పాటు వచ్చే సూక్ష్మజీవులు స్పంజికా కుహరంలోకి ప్రవేశించి పోషణలో ఉపయోగపడతాయి.
* జాంతవ భక్షక పోషణ ఉంటుంది. స్పంజికలు అవలంబక పోషకాలు (వడపోత ఆహార సేకరణ). కాలర్ కణాలు క్రిమభక్షణ పద్ధతిలో ఆహార సేకరణ చేసి జీర్ణించుకొంటాయి. కొంత ఆహారాన్ని పక్కన ఉన్న అమీబోసైట్లకు అందిస్తాయి. థీసోసైట్ లలో ఆహారం నిలువ చేయడం జరుగుతుంది.
* స్పంజికల శారీరంలో గల అంతరాస్థి పంజరం కాల్షియం కార్బొనేట్ లేదా సిలికా కంటకాలు లేదా ప్రోటీన్ యుక్తమైన స్పాంజిన్ తంతువులతో నిర్మితమై ఉంటుంది.
* నాడీ కణాలు, జ్ఞాన కణాలు లేవు. శరీరపు వివిధ భాగాల విధులలో సమన్వయం లేదు.
* అలైంగికోత్పత్తి మొగ్గతొడగడం వల్ల జరుగుతుంది. స్పంజికలు ఉభయలింగజీవులు. శుక్రకణాలు, అండాలు కొయనోసైట్లు, ఆర్కియోసైట్ల నుంచి ఏర్పడతాయి. కుల్యావ్యవస్థ ద్వారా స్పంజికా కుహరంలోకి ప్రవేశించిన శుక్రకణాలను కూయనోసైట్లు అండం వరకు చేర్చుతాయి. స్త్రీ సంయోగ బీజాలు గల మీసోహిల్ లో ఫలదీకరణ జరుగుతుంది.
* స్పంజికలలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ. విడికణాలు కూడాఅ సంకలితంగా చేరి స్పంజిక పూర్తి శరీరాన్ని ఏర్పరుచుకొంటాయి.
 
== వర్గీకరణ ==
* కాల్కేరియా: ఉదా: స్కైఫా
* హెక్సాక్టినెల్లిడా: ఉదా: హయలోనీమా
* డిమోస్పాంజియా: ఉదా: స్పాంజిల్లా, యూస్పాంజియా, ఛలైనా
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
పంక్తి 73:
[[nn:Svampar]]
[[no:Svamper]]
[[nv:Táłtłʼááh yilcháazhii]]
[[oc:Porifera]]
[[pl:Gąbki]]
"https://te.wikipedia.org/wiki/స్పంజిక" నుండి వెలికితీశారు