పల్లెటూరి పిల్ల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
 
==విశేషాలు==
*మహానటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన తొలి చిత్రం 'పల్లెటూరి పిల్ల'. ఈ సినిమాతో ప్రారంభమైన వీరి కలయిక తదనంతరకాలంలో ఎన్నో అద్భుత చిత్రాలు రావడానికి కారణమైంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే సమాన స్థాయి కలిగిన ఏ ఇద్దరు హీరోలకు లేని రికార్డ్‌ను 14 చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించి నెలకొల్పారు. అలాగే హీరోగా ఎన్.టి.ఆర్. కెమేరా ముందుకు వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ సినిమా షూటింగ్ ముందు మొదలయినప్పటికీ ఆయన సోలో హీరోగా నటించిన 'షావుకారు' చిత్రం మొదట విడుదలైంది. ఎల్.వి. ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్.టి.ఆర్.కు మేకప్ టెస్ట్ జరిగినప్పుడు తీసిన స్టిల్స్ చూసి హీరోగా తన సినిమాలో అవకాశం ఇచ్చారు బి.ఎ.సుబ్బారావు.
 
*శోభనాచల స్టూడియోలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న సుబ్బారావు ఆ స్టూడియో అధినేత మీర్జాపురం రాజా ఆశీస్సులతో సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి 'పల్లెటూరి పిల్ల' చిత్రాన్ని నిర్మించారు.అంతకుముందు ఏ దర్శకుడి దగ్గరా పనిచేసిన అనుభవం లేకపోయినా తనకున్న అవగాహనతో దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తీశారు. అంజలీదేవి టైటిల్ పాత్రను పోషించిన ఈ చిత్రం విడుదలై ఏప్రిల్ 27, 2010న 60ఏళ్లు పూర్తయ్యాయి.
 
* ఫిబ్రవరి 9, 1949న శోభనాచల స్టూడియోలో ప్రారంభమైన 'పల్లెటూరి పిల్ల ' చిత్రానికి రిజక్ట్ షెరిటన్ రాసిన 'ఫిజారో' ఆంగ్ల నాటకం ఆధారం. ఈ నాటకాన్ని తెలుగు వాతావరణానికి అనుగుణంగా మార్చి ఈ చిత్రకథను పి.ఆదినారాయణరావు తయారు చేశారు. సుబ్బారావు స్నేహితుడైన ఆయన ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడంతో పాటు ఓ పాట కూడా రాశారు.
 
*ఈ చిత్రంలో వసంత్ పాత్రను మొదట ఆనాటి ప్రముఖ హీరో కె.రఘురామయ్య పోషించారు. అంజలీదేవి కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో అప్పుడు ఆ పాత్రను అక్కినేని పోషించారు. సుబ్బారావుతో సన్నిహిత సంబంధం ఉన్న కారణంగా తక్కువ పారితోషికం తీసుకుని త్యాగపూరితమైన వసంత్ పాత్రను పోషించారు.
 
*ఈ చిత్రంలో ఎద్దుతో పోరాడే సన్నివేశంలో ఎన్.టి.ఆర్. కుడిచేయి విరిగింది. డూప్‌ని పెట్టి ఆ సన్నివేశం తీద్దామని సుబ్బారావు చెప్పినా సహజత్వం ఉండదని రామారావు భావించి తనే ఎద్దుతో పోరాటానికి దిగారు. ఈ పోరాటంలో ఎద్దు ఒక కుమ్ము కుమ్మి అవతలకి విసిరెయ్యడంతో ఆయన చెయ్యి విరిగింది.
 
*ఈ చిత్రంలో కథానాయికగా నటించిన అంజలీదేవి అప్పటికే పెద్ద హీరోయిన్. అయినా కొత్త హీరో పక్కన నటించడానికి ఏమీ అభ్యంతరం చెప్పలేదు.
 
*ఈ చిత్రంలో విలన్ కంపన దొర పాత్రను తన స్నేహితుడు ఎస్.వి.రంగారావుతో వేయించాలని సుబ్బారావు అనుకున్నారు. అయితే ఆయన చెన్నై చేరుకోవడం ఆలస్యం కావడంతో ఆ పాత్రను ఏ.వి. సుబ్బారావుతో వేయించారు. ఆ తర్వాత ఈ చిత్రంలో తాత పాత్రను రంగారావు పోషించారు.
 
*ఈ సినిమాలో మెయిన్ హీరో రామారావు కనుక ఆయన పేరు మొదట వెయ్యమని అక్కినేని సూచించినా సీనియారిటినీ గౌరవిస్తూ టైటిల్స్‌లో ఎ.ఎన్.ఆర్. పేరే మొదట వేశారు సుబ్బారావు.
 
*ఏప్రిల్ 27, 1950న విడుదలైన 'పల్లెటూరి పిల్ల' చిత్రం విజయం సాధించి హీరోగా ఎన్.టి.ఆర్. భవిష్యత్‌కు బంగారు బాట ఏర్పరచింది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/పల్లెటూరి_పిల్ల" నుండి వెలికితీశారు