మధ్వాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరిస్తున్నాను
పంక్తి 4:
==పుట్టుక==
మద్వాచార్యులు [[ఉడిపి]] వద్ద నున్న [[పాజక]] గ్రామంలో జన్మించాడు. మధ్వాచార్యుడి జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యుడు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధ్యగేహ భట్ట, వేదవతి లుగా పేర్కొన్నాడు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యుడు అనే పేర్లతో ప్రసిద్ధి పొందాడు.
 
బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు. పదకొండేళ్ళ పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉడుపి సమీపంలో నివసిస్తున్న, ఆకాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన అచ్యుత ప్రజ్ఞ అనే గురువు ద్వారా సన్యాస దీక్షను స్వీకరించాడు. అప్పుడే ఆయన పేరు పూర్ణప్రజ్ఞుడు గా మారింది.
 
ఒక నెల తరువాత ఓ తర్క శాస్త్ర పండితుల బృందాన్ని తన వాదనా పటిమతో ఓడించాడు. ఆయన ప్రజ్ఞకు అబ్బురపడిన అచ్యుత ప్రజ్ఞ ఆయన్ను వేదాంత పరమైన అంశాలపై అధిపతిగా నియమించి ఆనందతీర్థ అనే బిరుదు కూడా ఇచ్చాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/మధ్వాచార్యుడు" నుండి వెలికితీశారు